iDreamPost
android-app
ios-app

TS: ఉచిత కరెంట్, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు.. ఎప్పటినుంచంటే.!

  • Published Feb 21, 2024 | 9:43 AM Updated Updated Feb 21, 2024 | 1:20 PM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారెంటీ పథకాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అలాగే మిగిలిన పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఈ పథకాల గురించి మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే.. విడుదల చేస్తామని చెప్పాగా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారెంటీ పథకాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అలాగే మిగిలిన పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఈ పథకాల గురించి మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే.. విడుదల చేస్తామని చెప్పాగా

  • Published Feb 21, 2024 | 9:43 AMUpdated Feb 21, 2024 | 1:20 PM
TS: ఉచిత కరెంట్, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు.. ఎప్పటినుంచంటే.!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. . అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రాష్ట్రమంతా ఫ్రీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టారు. అయితే తాజాగా ఈ పథకాలతో పాటు కొత్త పోర్టల్ కోసం మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లో నిర్వహించిన.. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలనేవి అమలు చేసిందో చెప్పాలన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 స్థానాలకు గానూ.. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని.. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశామని అన్నారు.

అలాగే త్వరలోనే.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తో పాటు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా అమలు చేస్తామని తెలిపారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పారు. అలాగే ధరణి పోర్టల్ స్థానంలో త్వరలోనే మరో కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అంతేకాకుండా.. ఫేక్ డాక్యుమెంట్స్ పేరుతో ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక గృహ జ్యోతి, మహాలక్ష్మీ పథకాలను త్వరలో ప్రారంభించడమే కాకుండా.. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు.

దీంతో పాటు గ్యాస్ సిలిండర్లపై రూ.500 రాయితీ ఇస్తామన్నారు. అయితే 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం.. చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 80 రోజులు అయ్యింది. అంటే ఇంకో 20 రోజుల్లో మిగిలిన హామీల అమలుకు సంబంధించి గుడ్ న్యూస్ వినచ్చు అన్నమాట. మరి త్వరలోనే ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.