iDreamPost
android-app
ios-app

హోలీ వేళ విషాదం…నలుగురు యువకులు మృతి!

హాలీ పండగ రోజు దేశం మొత్తం సంతోషంగా ఉంది. రంగులు చల్లులకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఉత్సాహంగా గడుపుతున్న వేళ అసిఫా బాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నలుగురు యువకులు జలసమాధి అయ్యారు.

హాలీ పండగ రోజు దేశం మొత్తం సంతోషంగా ఉంది. రంగులు చల్లులకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఉత్సాహంగా గడుపుతున్న వేళ అసిఫా బాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నలుగురు యువకులు జలసమాధి అయ్యారు.

హోలీ వేళ విషాదం…నలుగురు యువకులు మృతి!

దేశ వ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరూ రంగులల్లో మునిగితేలారు. అయితే ఇలా అందరు సంతోషంగా హోలీ పండగలో మునిగి తేలుతుంటే..ఓ విషాదం చోటుచేసుకుంది. అసిఫాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. నదిలోకి స్నానానికి వెళ్లిన గల్లంతైన యువకుల కథ విషాదంగా ముగిసింది. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక పూర్తి వివారల్లోకి వెళ్తే..

అసిఫాబాద్  జిల్లా కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగత జీవులుగా మారారు.  కోటాల మండలం నదిమాబాద్ కు చెందిన నదీమబాద్‌కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)లు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాలీ పండగను ఘనంగా జరపుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ సెల్పీలు దిగి హోలీ సంబురాలు ఎంతో ఆనందగా జరుపుకున్నారు. అయితే ఈ సంతోషం వెనుక తమ వెంట మృత్యువు వస్తుందని వారు గ్రహించలేక పోయారు. రంగులతో మునిగిపోయినా ఆ నలుగురు స్నేహితులు స్నానం చేసేందుకు తాటిపల్లి సమీపంలో ఉన్న వార్ధా నదికి వెళ్లారు. అక్కడ కాసేపు సంతోషంగా గడిపారు.

అనంతరం స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు. అయితే వారు కేకలు వేస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే నది వద్దకు చేరుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో నదిలో గల్లంతైన ఆ నలుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లభించలేదు. చివరకు నలుగురు నీటిలో విగత జీవులుగా మారారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసీన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల ఆస్పత్రితకి తరలించారు. పండుగ నాడు  ఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

యువకుల మృతితో వాళ్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇలా నదుల్లోకి వెళ్లి.. పలువురు జల సమాధి అయిన ఘటనలు అనేక ఉన్నాయి. నదిలో లోతుపై అవగాహన లేకపోవడం, అలానే సరిగ్గా వచ్చి..రానీ ఈతతో నదిల్లోకి, చెరువుల్లో దిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హోలీ వేళ నదికి వెళ్లిన ఈ  యువకులు నీట మునిగి వారి కుటుంబాల్లో విషాదాలు నింపారు. ఇలా ఎంతో మంది సరదాల కోసం చేసే పనులు వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.