iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేటలో DCM, నాలుగు బస్సులు ఢీ!

  • Published Oct 04, 2024 | 12:29 PM Updated Updated Oct 04, 2024 | 12:29 PM

Suryapet District: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

Suryapet District: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

  • Published Oct 04, 2024 | 12:29 PMUpdated Oct 04, 2024 | 12:29 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేటలో DCM, నాలుగు బస్సులు ఢీ!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.  రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. వేల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు.  డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ట్రాఫిక్ నిబంధనలు కఠనతరం చేస్తున్నా.. భారీ చలాన్లు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అంటున్నారు అధికారులు.  సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సూర్యాపేట జిల్లాలో గల 65వ నెంబర్ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొటి ఐదు వాహనాలు ఢీకొన్నాయి. అర్థరాత్రి సమయంలో మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆకుపాముల వద్ద ఓ బస్సు ముందుకు వెళ్తూ సడెన్ గా ఆగిపోయింది.  వెనుక వస్తున్న మరో బస్సు కంట్రోల్ తప్పి దాన్ని ఢీ కొట్టింది. దాని వెంటే ఉన్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీ కొన్నాయి.. అందులో ఒక బస్సుకు ఓ డీసీఎం వ్యాన్  ఢీ కొట్టింది. ఇలా వరుసగా ఒకదానినొకటి ఢీ కొట్టుకోవడంతో రోడ్డంతా చిందరవందరగా మారిపోయింది.  ఇవన్నీ వేర్వేరు ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందినవిగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరికొంత మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది వరకు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.జాతీయ రోడ్డుపై ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. రాత్రి సమయంలో ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ రోడ్డుపై కూర్చునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు క్రేన్స్ ని తీసుకువచ్చి వాహనాలను పక్కకు తీయడంతో ట్రాఫిక్ క్లీయర్ అయ్యింది. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు. జాతీయ రహదారిలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.