iDreamPost
android-app
ios-app

మంచి మనసు చాటుకున్న KTR.. మహిళకు ఆర్థిక సాయం

  • Published Dec 25, 2023 | 9:54 AM Updated Updated Dec 25, 2023 | 10:52 AM

ప్రజా సమస్యలపై స్పందించాలంటే.. అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు.. స్పందించే మనసు ఉంటే చాలు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు మాజీ మంత్రి కేటీఆర్. కష్టంలో ఉన్న మహిళకు ఆర్థిక సాయం అందించి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. ఆ వివరాలు..

ప్రజా సమస్యలపై స్పందించాలంటే.. అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు.. స్పందించే మనసు ఉంటే చాలు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు మాజీ మంత్రి కేటీఆర్. కష్టంలో ఉన్న మహిళకు ఆర్థిక సాయం అందించి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు కేటీఆర్. ఆ వివరాలు..

  • Published Dec 25, 2023 | 9:54 AMUpdated Dec 25, 2023 | 10:52 AM
మంచి మనసు చాటుకున్న KTR.. మహిళకు ఆర్థిక సాయం

సాయం అని కోరిన వారిని ఆదుకోవడానికిఅధికారం ఉండాల్సిన అవసరం లేదు.. ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన మంచి మనసు ఉంటే చాలు అంటారు. ఈ మాటలు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు కరెక్ట్ గా సరిపోతాయి. సాయం చేయడానికి అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది ఆయనకు అక్కర లేదు. సమస్య తన దృష్టికి వస్తే చాలు వెంటనే స్పందిస్తారు కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్.. సోషల్ మీడియా, వ్యక్తిగతంగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందిస్తూ.. పరిష్కారం చూపేవారు. ఆర్థిక సాయం కూడా అందజేసేవారు.

మరి ఇప్పుడు ఓడిపోయారు కదా.. అలానే సాయం చేస్తారా అంటే.. ఆదుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు కానీ.. అధికారంలో ఉండటం ప్రధానం కాదని నిరూపించారు ఎమ్మెల్యే కేటీఆర్. సమస్యల్లో ఉన్న మహిళకు ఆర్థిక సాయం అందజేసి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఆ వివరాలు..

KTR is good hearted.. Financial help for woman

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు చేరువ అయ్యేలా, వారి సమస్యలను తెలుసుకుని.. సాయం చేయడం కోసం.. ‘ప్రజా దర్బార్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రజా దర్బార్‌కు తరలి వస్తున్నారు. ఎముకలు వణికించే చలిని సైతం లెక్క చేయక.. ప్రజా దర్బార్ కు తరలి వచ్చి.. తమ గోడు చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అన్నపూర్ణ అనే మహిళ ప్రజా దర్బార్‌కు వచ్చి తన సమస్య చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిశారు. అన్నపూర్ణ కుమార్తె నర్సింగ్ చదువుతోందని.. అందుకు ఆర్థిక సాయం కావాలని కోరారు అన్నపూర్ణ. ఆమె సమస్య తెలుసుకున్న కేటీఆర్.. అన్నపూర్ణ కుమార్తె నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

బంజారా హిల్స్‎లో ఉన్న తన ఇంటికి పిలిపించుకుని మరీ చెక్కు అందించారు. తన కూతురు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు అన్నపూర్ణ. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి.. సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్‎కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.