Krishna Kowshik
ఫ్రెండ్ కు పార్టీ ఇవ్వాలన్నా, పేరెంట్స్ తో బయటకు వెళ్లాలన్నా.. ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ కు వెళుతుంటారు. కానీ ఇటీవల హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో
ఫ్రెండ్ కు పార్టీ ఇవ్వాలన్నా, పేరెంట్స్ తో బయటకు వెళ్లాలన్నా.. ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ కు వెళుతుంటారు. కానీ ఇటీవల హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో
Krishna Kowshik
హోటల్స్, రెస్టారెంట్లను పెంచి పోషిస్తున్నారు బ్యాచులర్స్, ఫ్యామిలీస్. వంట చేసుకోలేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఫేమస్ రెస్టారెంట్లకు వెళ్లి ఆరగించేస్తున్నారు. లేదంటే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ఇవి తమ పాలిట వరంగా మారాయి అనుకుంటున్నారు.. కానీ ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అసలు విషయాలు వెలుగు చూశాయి. మీరు తింటున్నది ఆహారం కాదు విషం అని నిరూపించేలా చేశారు అధికారులు. చిన్నచిన్న హోటల్సే కాదు.. 5 రేటింగ్ ఉన్న ఫుడ్ సెంటర్లలో కస్టమర్లకు అందిస్తున్న ఆహారాన్ని బట్టబయలు చేశారు. కల్తీ ఆహరం, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన మాంసం, పురుగులు పట్టిన పిండి పదార్థాలతో వంటలు చేసి వడ్డిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
ఇక కొన్నింటిలో వంట గది తీరును చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ఖంగుతిన్నారు. నీట్ నెస్ లేకుండా.. చాలా మురికిగా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా మరో రెస్టారెంట్ నిర్వాకాన్ని బయటపెట్టారు. ఇటీవల కాలంలో కస్టమర్లను ఆకర్షించేందుకు విభిన్న పద్దతులను తీసుకువస్తున్నాయి రెస్టారెంట్లు. అలాంటి వాటిల్లో ఒకటి ట్రైన్ థీమ్ పార్క్. ఇందులో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంపల్లిలోని ఓ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. అందులో పాడైపోయిన జీడిపప్పు, కాలి ఫ్లవర్, కుళ్లిపోయిన ఉల్లిపాయలను గుర్తించారు. ఇదొక ఎత్తైతే.. సింక్ పరిస్థితి మరింత అధ్వానం. సింక్ లో నీళ్లు బ్లాక్ అయ్యి కిచెన్ అపరిశుభ్రంగా ఉందని గమనించారు.
శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపారు. అలాగే వట్టి నాగులపల్లిలోని ప్రిజం బార్ అండ్ రెస్టారెంట్‌లో కూడా తనిఖీలు చేపట్టగా.. ఈ రెస్టారెంట్ స్టోర్ రూమ్ మొత్తం ఎలుకలు తిరుగుతున్నాయట. అలాగే గడువు ముగిసిన ఆహార పదార్ధాలను అక్కడ నిల్వ చేసి ఉంచడాన్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిచెన్ అయితే వేరే లెవల్. కుళ్లిపోయిన కూరగాయలతో కంపు కొడుతుందట. మేడ్చల్ లోని తాజా ఆల్ డే బ్రేక్ ఫాస్ట్ హోటల్లో కూడా పాడైపోయిన దాల్చి చెక్కను గుర్తించారు అధికారులు. ఇవే కాదు గతంలో పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఇదే అధ్వాన పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. దీంతో బయట ఫుడ్ అంటే భయపడిపోతున్నారు తెలంగాణ వాసులు. బతికుంటే బలిసాకు తినొచ్చని ఈ రెస్టారెంట్స్, హోటల్స్ ను చూశాక అనుకుంటున్నారు.