ఇకపై తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆ ప్రాంతంలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణ, ఏపీలను అనుసంధానం చేసే హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఎలా అంటే..

నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణ, ఏపీలను అనుసంధానం చేసే హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఎలా అంటే..

నగరంలో ట్రాఫిక్ రద్దీ అంటే మాములుగా ఉండదు. ముఖ్యంగా ఈ ట్రాపిక్ సమస్యలు అనేవి రోజు రోజుకు భారీగా పెరిగిపోగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడబడితే అక్కడ ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణలకు అంతరాయం కలుగుతుంటుంది. ఇక ఈ సమస్యలను చెక్ పెట్టడానికే.. ఎప్పుడు విస్తృతంగా పలు చోట్ల ఫైఓవర్లు నిర్మిస్తున్నారు. దీంతో కొంత మేరకు ఈ ట్రాఫిక్ కష్టలకు ఉపశమనం దొరుకుతుంది. అంతేకాకుండా.. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇకపై తెలంగాణ, ఏపీలను అనుసంధానం చేసే హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్లే..

ఇక నుంచి ప్రయాణికులకు అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇక్కట్లు కొంతమేర తీరనున్నాయి. ఎందుకంటే.. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. అయితే ఇది ఎమ్మార్వో ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వరకు 2 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇకపోతే ఈ ఫ్లైఓవర్ కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, పై వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్దారణ కావడంతో.. ఇప్పుడు పనులు మరింత వేగంగా జరిగేందుకు అవకాశం ఉందని తాజాగా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శంకుస్థాపన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో చేయునున్నట్లు సమాచారం.

అయితే ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా.. ఇరువైపులా జాతీయ రహదారులు సంస్థ అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టారు. ఇకపోతే ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్‌ వరకు 500 మీటర్ల మేర ఈ వంతెన పనులు సాగుతుండగా.. ఇవి మరో వారం, పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాకపోతే ఒకవైపు ఈ పనులు పూర్తయిన తర్వాత రెండోవైపు చేపడతామని తెలిపారు. ఇక ఫ్లైఓవర్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న హరియాణాకు చెందిన రాంకుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఈ నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. మరి, త్వరలోనే ట్రాఫిక్ కష్టాలను నుంచి ఊరటనిస్తూ.. భారీ ఫ్లైఓవర్ ను నిర్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments