iDreamPost

బాకీ తీర్చండి.. మా ఆత్మలు శాంతిస్తాయి! చనిపోయిన వారి పేరిట ఫ్లెక్సీలతో కలకలం!

  • Published Jul 04, 2024 | 10:13 AMUpdated Jul 04, 2024 | 10:13 AM

Flexi in Siddipet: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు, ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వినూత్నమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Flexi in Siddipet: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు, ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వినూత్నమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

  • Published Jul 04, 2024 | 10:13 AMUpdated Jul 04, 2024 | 10:13 AM
బాకీ తీర్చండి.. మా ఆత్మలు శాంతిస్తాయి! చనిపోయిన వారి పేరిట ఫ్లెక్సీలతో కలకలం!

ఈ రోజుల్లో డబ్బుకి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మోసాలు, అక్రమాలకు పాల్పపడుతున్నారు. డబ్బు కోసం సొంత వారినే మోసం చేస్తున్నారు.  ఎదుటి వారిని మాయమాటలతో బురిడీ కొట్టించి అందినంత దోచేస్తున్నారు. కొంతమంది అవసరానికి తీసుకున్న డబ్బు చెల్లించకుండా ముఖం చాటేస్తుంటారు. చనిపోయిన దంపతుల వద్ద బాకీ చేసి తప్పించుకుంటున్నవారి కోసం బంధువులు వినూత్ర ప్రక్రియలో బాకీ వసూలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇంతకీ ఏ ఊరూ.. బంధువులు ఏం చేశారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా ధుల్మిట్ట మండలానికి చెందిన తాడూరు కరుణాకర్, దివ్య దంపతులు. వీరికి శివ, శశి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులు కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇంటి ముందు కిరాణా షాపు నిర్వహించేవారు.  హ్యాపీగా సాగుతున్న వీరి కుటుంబంలో విషాదం నెలకొంది. నాలుగేళ్ల క్రితం వ్యవసాయ బావి వద్ద కరెంట్ షాక్ తో కరుణాకర్ కన్నుమూశాడు. భర్త మరణంతో తీవ్ర ఆవేదనతో కొంతకాలం దివ్య అనారోగ్యంతో ఇబ్బంది పడింది. పిల్లల కోసం తేరుకొని వ్యవసాయం చేసుకుంటూ.. కిరణా షాపు నడిపించుకుంటు పిల్లలను పోషించుకుంటుంది. దివ్య తన కిరాణా షాప్ కు వచ్చిన వారికి కాదనకుండా ఉద్దెరకు సరుకులు ఇచ్చేది.. ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆమె వద్దకు వెళ్తే చేబదులుగా డబ్బు ఇచ్చేది. విధి మళ్లీ వెక్కిరించింది.. ఏప్రిల్ 2న దివ్య అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో పిల్లలు ఇద్దరు అనాధలైపోయారు. ప్రస్తుతం నాయనమ్మ, తాత, బాబాయి సంరక్షణలో ఉంటున్నారు.

తమ కొడుకు, కోడలు బతికి ఉండగా కిరాణాల షాపులో ఉద్దెరకు సరుకులు తీసుకున్నవారు, చేబదులు తీసుకున్న వారు తిరిగతి డబ్బులు చెల్లిస్తే పిల్లల చదువులకు పనికి వస్తాయని కుటుంబ సభ్యులు చనిపోయిన కరుణాకర్, దివ్య పేరు పై ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ‘మేము తెలియజేయునది ఏమనగా నా ద్వారా కిరాణా షాపులో సరుకులు ఉద్దెరగా తీసుకున్నవారు, చేబదులు తీసుకున్న వారు దయచేసి ప్రతి రూపాయి మా పిల్లలకు అందజేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా’ అంటూ అభ్యర్థించారు. గ్రామంలో పలు చోట్ల వెలసిన ఈ ఫ్లెక్సీలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అనాథలైన చిన్నారులు శివ, శశిలకు పోలీస్ శాఖ తరుపున సహాయం అందించాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించడంతో చేర్యాల సీఐ శ్రీను పిల్లల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్కూల్ డ్రెస్, బుక్స్ ఇతర అవసరాలకు సరిపడ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి