Keerthi
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నిత్యం రైతులు వివిధ రకాల పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం కొనసాగిస్తుంటారు. అయితే ఈ మార్కెట్ కు ప్రభుత్వం 5 రోజుల పాటు సెలువులు ప్రకటించి ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నిత్యం రైతులు వివిధ రకాల పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం కొనసాగిస్తుంటారు. అయితే ఈ మార్కెట్ కు ప్రభుత్వం 5 రోజుల పాటు సెలువులు ప్రకటించి ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..
Keerthi
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురించి అందరికి తెలిసిందే. ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ గా పేరుగాంచింది. కాగా, ఈ మార్కెట్ 117 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. పై గా ఈ మార్కెట్ ను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీగా నిర్వహిస్తుంది. ఇక ఇక్కడకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా.. రైతులు పండించిన వివిధ రకరకాల పంటలను అమ్మడానికి తీసుకువస్తుంటారు. ఈ క్రమంలోనే ఎనుమాముల మార్కెట్ లో.. 450 మంది ఆడితిదారులు,300 మంది వ్యాపారులు, 800 మంది పరిపాలన సిబ్బంది, అలాగే వేలాది మంది కూలీలు ఉంటారు. పైగా ఈ మార్కెట్ లో మిర్చి, పత్తి అమ్మకాలు ఎప్పుడు ఉత్తమ స్థానంలో ఉంటుంది. వాటితో పాటు పలు పంటల విక్రయాలు కూడా ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. అంతేకాకుండా.. ఎంత సరుకు వచ్చినా సరే ఒక్కరోజులోనే రైతులు తమ దిగుబడులను అమ్ముకొని వెళ్తుంటారు. నిత్యం ఈ మార్కెట్ లో పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వ 5 రోజులు సెలవును ప్రకటిస్తూ ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..
నిత్యం రైతుల పంట విక్రయాలతో రద్దీగా ఉన్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తాజాగా ప్రభుత్వం 5 రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా రైతులకు ఊహించని షాక్ తగిలింది. అయితే సెలవులు అనేవి ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉంటాయని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్య కూడా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ సెలవలకు కారణం.. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 6న వారాంతపు యార్డ్ బంద్,7న ఆదివారం, 8న అమావాస్య, 9న ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో 5 రోజులపాటు మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఇక రైతులు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇక సెలవుల అనంతరం మళ్లీ యధావిధిగా ఈ నెల 10న నుంచి మార్కెట్ లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.
దీంతో, అసలే పండుగ సీజన్ కావడంతో..పంటను అమ్ముకుని లాభాలను ఆర్జించలి అనుకున్న రైతులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా, ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం , అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడంతో రైతు కంట కన్నీరు వస్తుంది. అయితే వీటన్నీంటిని తట్టుకొని వచ్చిన పంటను పండగ సమయంలో అమ్ముకొని లాభాలను పొందాలి అనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఈ సెలవులు కారణంగా పంటలతో నిండుగా ఉండవల్సిన వరంగల్ జిల్లా ఏనుమాములు మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది. మరి, పండుగలా సీజన్ కావడంతో వరుసగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.