iDreamPost

కొత్తగూడెంలో పిడుగుపాటు.. ప్రభుత్వానికి రూ. 30 కోట్ల నష్టం.. ఎలా అంటే

  • Published Jul 01, 2024 | 8:00 AMUpdated Jul 01, 2024 | 8:00 AM

Lightning: తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొన్ని చోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెంలో పిడుగు పడటం వల్ల ప్రభుత్వానికి 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ వివరాలు..

Lightning: తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొన్ని చోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెంలో పిడుగు పడటం వల్ల ప్రభుత్వానికి 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ వివరాలు..

  • Published Jul 01, 2024 | 8:00 AMUpdated Jul 01, 2024 | 8:00 AM
కొత్తగూడెంలో పిడుగుపాటు.. ప్రభుత్వానికి రూ. 30 కోట్ల నష్టం.. ఎలా అంటే

దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్‌ నెల ప్రారంభం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెల చివరి వరకు మండే ఎండలతో బాధపడ్డ జనాలకు ఈ ఏడాది త్వరగానే ఉపశమనం లభించింది. మే నెలలోనే సగం రోజులకు పైగా వర్షాలు కురవడంతో.. ఎండ తీవ్రత నుంచి కాస్త తప్పించుకున్నారు. ఇక జూన్‌ నెల ప్రారంభం నుంచే వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈ ఏడాది జోరు వానలు ఉంటాయిని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో వర్షాలు కురుస్తూ.. వాతావరణం చల్లగా ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఎండలు మండుతున్నాయి దాంతో జూన్‌ నెల చివరి వరకు వేసవి సెలవులు పొడగించిన సంగతి తెలిసింందే.

ఇక వర్షాకాలం అనగానే జోరు వానలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగు పాటు ఘటనలు సహజం. ఇక తాజాగా తెలంగాణలో జోరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెంలో పిడుగు పడటంతో.. ప్రభుత్వానికి 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదేంటి.. పిడుగుపడితే ప్రభుత్వానికి నష్టం ఎలా అంటే..

తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం జోరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భద్రాద్రి పవర్ ప్లాంట్‌ ఆవరణలో శనివారం పిడుగు పడింది. జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇక ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. విలువైన ఫ్లాంట్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పిడుగుపాటు కారణంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం రాష్ట్రంలో కరెంట్ సరఫరాపై పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్లాంటులో పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి