iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌: అన్‌లిమిటెడ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • Published Aug 02, 2023 | 10:42 AMUpdated Aug 02, 2023 | 11:23 AM
  • Published Aug 02, 2023 | 10:42 AMUpdated Aug 02, 2023 | 11:23 AM
హైదరాబాద్‌: అన్‌లిమిటెడ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని ఓ బట్టల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ పక్కనే పెట్రోల్‌ బంక్‌ కూడా ఉండటంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌, హబ్సిగూడలో చోటు చేసుకుంది. అన్‌లిమిటెడ్‌ షాపింగ్‌ మాల్‌లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్లుండి మాల్‌లో మంటలు చెలరేగాయి. దాంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న అన్‌లిమిటెడ్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఓ పెట్రోల్‌ బంక్‌ ఉంది. దాంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే షాపింగ్‌ మాల్‌లోని రెండు అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో మాల్‌లోని దుస్తులు తగలబడటంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డు మీద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

అటు అత్తాపూర్‌ హసన్‌నగర్‌లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బట్టల గోదాంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దాంతో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించడంతో.. ఊపిరాడక జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో ఒకే రోజు రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో జనాలు ఆందోళన పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి