వీడియో: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్.. పరుగులు పెట్టిన జనం!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రసాయనాలు, డీజీల్, పెట్రోల్ ను తరలిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నెలల క్రితం  ఓ ప్రాంతంలో ప్రమాదానికి గురైన పెట్రోల్ ట్యాంకర్ వద్ద జనం కుమ్మికూడి.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 42 మంది చనిపోయారు.

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రసాయనాలు, డీజీల్, పెట్రోల్ ను తరలిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నెలల క్రితం  ఓ ప్రాంతంలో ప్రమాదానికి గురైన పెట్రోల్ ట్యాంకర్ వద్ద జనం కుమ్మికూడి.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 42 మంది చనిపోయారు.

నిత్య జీవితంలో ఎన్నో రకాల ఘటనలు, ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాము. వార్త రూపంలో చదువుతూ ఉంటాము. అయితే కొన్ని రకాల ప్రమాదాలు  చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. మరికొన్ని మాత్రం ఒంట్లో వణుకును పుట్టిస్తాయి. ముఖ్యంగా కొన్ని చిన్న ప్రమాదాలు అప్రమత్తంగా లేకుంటే పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ప్రమాదాకరమైన రసాయనాలను  సరఫరా చేసే వాహనాలు యాక్సిడెంట్ కి గురైనప్పుడు..జనాలు చూపించే అత్యుత్సాహంగా కారణంగా ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెట్రోల్ బంకులో ఓ లారీ డీజీల్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రసాయనాలు, డీజీల్, పెట్రోల్ ను తరలిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పల్టీ కొట్టడం, వేరే వాహనాన్ని ఢీకొట్టడం వంటి ఘటనతో రోడ్డుపై పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటేవారు..వాహనంలోని పెట్రోల్, డీజీల్ వంటి వాటిని తీసుకునేందుకు పెద్ద ఎత్తున గుమ్మిగూడుతుంటారు. ఇలాంటి క్రమంలోనే పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని  నెలల క్రితం  ఓ ప్రాంతంలో ప్రమాదానికి గురైన పెట్రోల్ ట్యాంకర్ వద్ద జనం కుమ్మికూడి.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 42 మంది చనిపోయారు. అలానే దాదాపు 80 మందికి తీవ్ర గాయాలాయ్యాయి.

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న..ఘోరం జరిగి ఉంటేది. భువనగిరి పట్టణంలో డీజిల్ కోసం ఓ పెట్రోల్ బంక్ కు లారీ వచ్చింది.  ఇలా బంకు లోపలకి వచ్చే క్రమంలో అకస్మాత్తుగా లారీలో మంటలు చెలరేగాయి. లారీకి ఉన్న పెద్ద డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతోనే మంటలు అంటుకున్నాయి.  ఇక ఒక్కసారిగా మంటలు చెలరేగడం.. అందులోనూ పెట్రోల్ బంకులో కావడంతో అక్కడి సిబ్బందితో సహా అక్కడి జనం భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే లారీ ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు, పెట్రోల్ బంక్​ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే మార్గంలోని నైహారా పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దశ్యాల  సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న పెను ప్రమాదం జరిగేదని అంటున్నారు. మరి.. ఇలాంటి ఘటనలకు నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments