iDreamPost
android-app
ios-app

మద్యం మత్తులో మటన్‌ కోసం కొట్లాట! ఏకంగా పెళ్లి పందిరిలోనే!

శుభకార్యం ఏదైనా తెలంగాణలో ముక్క ఉండాల్సిందే. ముక్క లేని భోజనాన్ని.. విందుగా భావించరు. అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా భావిస్తుంటారు. ఇప్పుడు ఇదే మటన్ ముక్కల కోసం..

శుభకార్యం ఏదైనా తెలంగాణలో ముక్క ఉండాల్సిందే. ముక్క లేని భోజనాన్ని.. విందుగా భావించరు. అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా భావిస్తుంటారు. ఇప్పుడు ఇదే మటన్ ముక్కల కోసం..

మద్యం మత్తులో మటన్‌ కోసం కొట్లాట! ఏకంగా పెళ్లి పందిరిలోనే!

జబర్దస్త్ వేణు డైరెక్టర్‌గా తెరకెక్కించిన చిత్రం బలగం హిట్ కొట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకున్న సంగతి విదితమే. మానవ బంధాలను వెండితెరపై ఎంతో అద్భుతంగా చూపించారు. మటన్ ముక్కల కోసం విడిపోయిన బావ బావమరదలు.. తిరిగి ఎలా కలుసుకున్నారో చూపించిన మూవీ బలగం. మటన్ ముక్కల కోసం గొడవలేందీ బయ్ అనుకోవచ్చు కానీ. తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా మటన్ ముక్క కంపల్సరీ. పుట్టిన రోజు వేడుకనా, ఓణీల ఫంక్షన్ అయినా, చివరకు పెళ్లికి కూడా ఇక్కడ ముక్కలు ఉండాల్సిందే. లేకుంటే ముద్ద దిగదు అతిధులకు. అసలు విందులో బొక్కలు పెట్టకపోతే గొడవలే జరుగుతుంటాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఈ ముక్కల కోసమే రక్తం చిందించారు.

వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన అమ్మాయికి.. వేముల వాడకు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఇంట్లో వివాహ తంతు జరుగుతుంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, చుట్టాలు,పక్కాలు వచ్చారు. పెళ్లి కొడుకు బంధువులకు మర్యాదలు తగ్గకుండా చూసుకుంటున్నారు వధువు కుటుంబ సభ్యులు. మటన్ కర్రీ, బగారా రైస్ వండి అతిధులకు వడ్డించారు. కానీ మద్యం సేవించిన వరుడు తరపు బంధువులు భోజనానికి కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే మటన్ కూర అయిపోయింది. భోజనానికి కూర్చున్న వారికి ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో గలాటాకు దిగారు వరుడు బంధువులు.

బొక్కలు లేకుండా ఎలా తింటామంటూ వధువు కుటుంబ సభ్యులపై గొడవకు దిగారు. వంట పాత్రలను, టేబుళ్లను ఎత్తి పడేసి.. వడ్డించే వారిపై దాడికి దిగారు. ఈ విషయంపై వధువు, వరుడు బంధువలు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వైపులా బంధువులు ఇద్దరికీ గాయాలయ్యాయి. రక్తం వచ్చేట్టు తన్నుకున్నారు. హాయిగా పెళ్లి చేసుకుంటుంటే.. వీరి గొడవ వల్ల ఆ వివాహ తంతు రసాభాసగా నిలిచింది. నూతన వధూవరులను మాత్రం వివాహ తంతు ముగిశాక.. వేముల వాడకు పంపించేశారు ఇరు తరుఫు తల్లిదండ్రులు. ఈ ఘటనపై అమ్మాయి, అబ్బాయి బంధువులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో.. 16 మందిపై కేసు నమోదు చేశారు. వరుడి తరఫు బంధువుల ఏడుగురిపై, వధువు తరఫు బంధువుల 9 మందిపై కేసు నమోదు చేశారు.