iDreamPost
android-app
ios-app

భాగ్యనగరంలో ఆడ దొంగలు! చెడ్డీ గ్యాంగ్ కన్నా డేంజర్ లా ఉన్నారే!

  • Author Soma Sekhar Published - 08:19 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 08:19 PM, Fri - 18 August 23
భాగ్యనగరంలో ఆడ దొంగలు! చెడ్డీ గ్యాంగ్ కన్నా డేంజర్ లా ఉన్నారే!

హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు దొంగల ముఠాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే భాగ్యనగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తుంటే.. వీరికి తోడు ఇంకో దొంగల ముఠా ఇప్పుడు హైదరాబాద్ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. చెడ్డీ గ్యాంగ్ ఓ వైపు.. కొత్తగా వచ్చిన ఆడ దొంగల ముఠా మరోవైపు భాగ్యనగర వాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా నగరంలో తిరుగుతున్న ఆడ దొంగలు ఇంట్లోకి చొరబడి సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్తున్నారు. వీరికి సంబంధించిన దృశ్యాలు ఓ ఇంటి సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.

భాగ్యనగరంలో ఓ ఆడ దొంగల ముఠా సంచరిస్తోంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకోవడం, ఆ సొమ్ముతో ఉడాయించడం వీరి పని. చూడ్డానికి శాలువాలు కప్పుకుని పేద వారిగా కనపడుతుంటారు. పగలంతా రెక్కీ నిర్వహించి.. రాత్రి పూట తమ పని కానిచ్చేస్తుంటారు ఈ కి’లేడీ’లు. ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ఓ లేడీ దొంగల ముఠా సీసీకెమెరాకు చిక్కింది. ఈ ఫుటేజీలో ముగ్గురు మహిళలు కనిపించారు. వారు చోరీ చేసిన వస్తువులను సంచిలో దాస్తున్న దృశ్యాలు ఓ ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చడ్డీ గ్యాంగ్ తో ఆందోళన పడుతున్న నగరవాసులకు ఈ లేడీ దొంగల ముఠా కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. చెడ్డీ గ్యాంగ్ కన్న డేంజర్ గా వీళ్లు కనిపిస్తున్నారు.

ఇదికూడా చదవండి: ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş