కూతురి సమాధిపై పడి తండ్రి కన్నీరు! గుండెలు పిండేసే కథ ఇది!

కూతురిపై తండ్రి ప్రేమ‌కు హ‌ద్దులుండ‌వు. తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర. తన కూతుర్ని అమ్మగా ప్రతి తండ్రి భావిస్తాడు. అలాంటి కూతురు మరణించడంతో ఓ తండ్రి హృదయం అల్లాడింది.

కూతురిపై తండ్రి ప్రేమ‌కు హ‌ద్దులుండ‌వు. తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర. తన కూతుర్ని అమ్మగా ప్రతి తండ్రి భావిస్తాడు. అలాంటి కూతురు మరణించడంతో ఓ తండ్రి హృదయం అల్లాడింది.

ఈ భూమి మీద బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ వెలకట్టలేనిది. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రేమానుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూతురు పుడితే.. తన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే వ్యక్తి తండ్రి. అందుకే తండ్రి తన కూతురి మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. తన కూతురు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. ఆమె ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటాడు. అలా కంటికి రెప్పల కాపాడుకున్న కూతురు శాశ్వతంగా దూరమైతే ఆ తండ్రి బాధ వర్ణించలేనిది. అలానే ఓ తండ్రి తన కూతురి సమాధిపై పడి కన్నీరు పెట్టిన దృశ్యాలు అందరి కలచి వేసింది. ఈ ఘటన తెలంగాణలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట పట్టణంలోని గోపాల్ పేట వీధికి లో రమేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆయనకు లక్ష్మీ ప్రణీత అనే కుమార్తె ఉంది. ఆమెను చిన్నప్పటి నుంచి రమేశ్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ పాప ఏమి  అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చే వాడు.  ప్రణీతను ప్రాణానికి ప్రాణంగా రమేశ్ పెంచుతున్నాడు. ఆమెను బాగా చదివించి.. మంచి స్థితిలో చూడాలని భావించాడు. ఇలా ఆయన ఒకటి తలిస్తే విధి మరోకటి తల్చింది. రమేశ్ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కుమార్తెను మృత్యువు కాటేసింది.

హోలీ పండుగ సందర్భంగా లక్ష్మీ ప్రణీత ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఓ మినీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలి.. ఆమెపై పడింది. ఈ ప్రమాదంలో ప్రణీతకు తీవ్రంగా గాయలై మృతి చెందింది. అదే రోజు సాయంత్ర పట్టణ శివారులోని శ్మశాన వాటికలో ప్రణీత అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాల కార్యక్రమాల పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన రమేశ్ స్నానం చేసి బయటకు వెళ్లాడు. ఇక తన కూతురి జ్ఞాపకాలను రమేశ్ మర్చిపోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ రాత్రి 11.30 గంటలు దాటిన కూడా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ప్రణీతాను పూడ్చిన ప్రదేశం వద్దకు వెళ్లి చూడగా.. అక్కడే పడుకుని ఉన్నాడు.

ఈ దృశ్యం చూసిన అక్కడి వారు..రమేశ్ కు తన కుమార్తెపై ఉన్న ప్రేమను చూసి కన్నీరు పెట్టుకున్నారు.  తన బిడ్డ సమాధి వద్ద గుండెలు పగిలేలా రోధిస్తున్న రమేశ్ ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చివరకు ఏదో విధంగా రమేశ్ ను సముదాయించి.. ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్న బిడ్డపై  ఓ తండ్రి చూపిన ప్రేమకు అందరి హృదయాలు చలించిపోయాయి. ఆ తండ్రి ప్రేమ ముందు చావు కూడా చినబోయిందంటూ ఈ దృశ్యం చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ నాన్నప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments