iDreamPost
android-app
ios-app

పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ!

  • Published Aug 08, 2024 | 10:24 AM Updated Updated Aug 08, 2024 | 10:24 AM

Farmer Daughter: ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే అంత సులభమైన పని కాదు.. ఎంతో కష్టపడి చదవాలి. ఒక్క ఉద్యోగానికి వేల సంఖ్యల్లో పోటీ ఉంటుంది. అయితే కృషీ, పట్టుదలతో పేదరికాన్ని జయించి కొంతమంది నిరుపేదలు, రైతు బిడ్డలు ఏక కాలంలో మూడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.

Farmer Daughter: ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే అంత సులభమైన పని కాదు.. ఎంతో కష్టపడి చదవాలి. ఒక్క ఉద్యోగానికి వేల సంఖ్యల్లో పోటీ ఉంటుంది. అయితే కృషీ, పట్టుదలతో పేదరికాన్ని జయించి కొంతమంది నిరుపేదలు, రైతు బిడ్డలు ఏక కాలంలో మూడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.

  • Published Aug 08, 2024 | 10:24 AMUpdated Aug 08, 2024 | 10:24 AM
పట్టుదలతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ!

దేశంలో చాలా మందికి మంచి చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సమాజంలో గౌరవంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే సర్కార్ కొలువు సంపాదిడచం అంద సులభమైన పనేమీ కాదు. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో అనుకోకుండా మరణిస్తే వారి వారసులకు సర్కార్ కొలువు ఇవ్వబడుతుంది. తప్పితే ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పోటీని తట్టుకొని ముందుకు సాగాలి.  సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లు రావడమే తక్కువ.. ఒకవేళ వచ్చినా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కొంతమంది ఎన్నిసార్లు విఫలమైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఇలాంటి కాంపిటీటీవ్ కాలంలో ఓ రైతు బిడ్డ ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించింది. ఆ విజేత ఎవరు, ఏ ఉద్యోగాలు సాధించింది అన్న వివరాలు తెలుసుకుందాం..

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎంతోమంది నిరుద్యోగులు అహర్శశలు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొంతమందికి కష్టపడ్డ ఫలితం దక్కితే.. మరికొంతమందికి నిరాశే మిగులుతుంది. అయినా వారి ప్రయత్నం మాత్రం విరమించరు. నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడినా పరీక్షలకు సిద్దమవుతుంటారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ యువతి పట్టుదలతో చదవి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. వివరాల్లోకి వెళితే.. జిగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన ముదుగంపల్లి చంద్రయ్య- భారతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురు స్రవంతికి ఇటీవల పెళ్లైంది. రెండో కూతురు జయ మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చింది.

టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించింది. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని, గేట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది. హైదరాబాద్ లోని జేఎన్‌టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఎలాంటి కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ లో అయినా తన సత్తా చాటే జయ ఇటీవల వెలువడిన పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఎంపికైంది. తాను మాత్రం ఏఈఈ ఉద్యోగంలో చేరుతా అని జయ తెలిపింది. చదువుకు పేదరికం అడ్డు రాదని కృషీ, పట్టుదల ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవొచ్చు అని అంటుంది ఈ రైతుబిడ్డ. తమ కూతురు చిన్నప్పటి నుంచి అన్నింటా విజయం సాధిస్తుందని, ఏక కాలంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందని జయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.