iDreamPost
android-app
ios-app

ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా? అయితే ఈ మోసం తెలుసుకోండి..

Fake PhonePe App: నేటికాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా కొత్త తరహా మోసాలకు కొందరు కేటుగాళ్లు పాల్పడుతున్నారు. మీరు ఎవరైనా ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా?. అయితే జాగ్రత్త.

Fake PhonePe App: నేటికాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా కొత్త తరహా మోసాలకు కొందరు కేటుగాళ్లు పాల్పడుతున్నారు. మీరు ఎవరైనా ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా?. అయితే జాగ్రత్త.

ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా? అయితే ఈ మోసం తెలుసుకోండి..

నేటికాలంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగి పోయింది. ప్రతి విషయంలోనూ టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు. అలానే డబ్బులు లావాదేవీలు కూడా అంతా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇదే సమయంలో కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అనేక రకాలు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ జనాల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. మీరు ఎవరైనా ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారా?. తెలిసిన వారి నుంచి అయితే ఒకే.. తెలియని వారి నుంచి తీసుకునే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మీరు మోసపోవడం ఖాయం. మీకు అసలు విషయం అర్థం కావాలంటే.. ఈ స్టోరీ చదవండి.

కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వ్యక్తులు వచ్చి..తన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు ఫోన్ పే చేస్తా అంటారు. ఈ క్రమంలోనే ఫోన్‌కు నగదు వచ్చినట్లు అవతలి వ్యక్తి ఫోన్‌లో చూపిస్తుంది. కానీ అది మీ  అకౌంట్ లో జమ అవదు. అందుకు కారణంగా కొందరు వ్యక్తులు ఫేక్ ఫోన్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ నకిలీ ఫోన్‌ పే యాప్‌ను అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. సరిగ్గా ఈ తరహా మోసం పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది.

Phomepe

పెద్దపల్లి  జిల్లా మంథనిలో ఓ వ్యక్తి  జిరాక్స్ షాపుకు వెళ్లాడు. అక్కడ తన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదని, ఫోన్ పే చేస్తానని తనకు లిక్విడ్ క్యాష్ ఇవ్వని చెప్తాడు. అయితే అతడి మాటలకు..షాపు వ్యక్తి కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్ పే చేయమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా  నగదును  చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు జిరాక్స్ షాపు వ్యక్తికి ఫోన్‌లో చూపించాడు. కానీ,  అతడి అకౌంట్ లోకి మాత్రం డబ్బులు రాలేదు. అనుమానం వచ్చిన జిరాక్స్ షాపు ఓనర్.. ఆ వ్యక్తి ఫోన్ తీసుకున్నాడు. నకిలీ ఫోన్‌ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు.

దీంతో అతడిని అలా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇలా నకిలీ ఫోన్ పే తో చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ మోసపోతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ  ఈ కేటుగాళ్లు చాకచక్యంగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.  ఇలా కొందరు కేటుగాళ్లు పెట్రోల్ బంకులు, సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ఫేక్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇలా ఎవరైనా ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ లావాదేవీల విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.