iDreamPost
android-app
ios-app

కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి! మన ప్రేమే వాళ్ళ పెట్టుబడి!

  • Published Jul 29, 2024 | 6:00 PM Updated Updated Jul 29, 2024 | 6:00 PM

ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. రోజుకొక కొత్త ఫ్లాన్స్ అమాయక ప్రజలను బెదిరిస్తూ, భయపడుతూ కొంతమంది సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. అయితే తాజాగా డ్రగ్స్ పేరిట మరో కొత్త సైబర్ నేరానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడంటే..

ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. రోజుకొక కొత్త ఫ్లాన్స్ అమాయక ప్రజలను బెదిరిస్తూ, భయపడుతూ కొంతమంది సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. అయితే తాజాగా డ్రగ్స్ పేరిట మరో కొత్త సైబర్ నేరానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడంటే..

  • Published Jul 29, 2024 | 6:00 PMUpdated Jul 29, 2024 | 6:00 PM
కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి! మన ప్రేమే  వాళ్ళ పెట్టుబడి!

ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో కొంతమంది సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఫ్లాన్స్ చేస్తూ.. అమాయకపు ప్రజలకు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు బ‍్యాంకు మెసేజ్‌లు,  గిప్టులు, కూపన్లు, ఈ కేవైసీలు,కొరియర్‌ ఫార్శిల్స్‌, డ్రగ్స్ పార్శిల్, ఢీప్‌ ఫేక్‌ ఫోటోలు వంటి రకరకాల పేర్లతో.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు డ్రగ్స్ కేసుల పేరిట పెద్ద సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాాగా ఈ క్రమంలోనే ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడంటే..

 తాజాగా నిజామాబాద్ జిల్లాలో  ఫోన్ కాల్ రూపంలో ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల రూపంలో  కొంతమంది సైబర్ నేరగాళ్లు ఓ యువతికి ఫోన్ చేసి  డ్రగ్స్ కేసులో మీ నాన్న ఇరుక్కున్నాడంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. డబ్బులు ఇవ్వకుంటే.. మీ నాన్న  కాళ్లు, చేతులు నరికేసి జైలులో వేస్తామని హెచ్చరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ కాల్ చేశారు. ఇక ఆ కాల్ పోలీస్ డీపీతో ఉన్న నెంబర్ కావడంతో వెంటనే ఆ యువతి లిఫ్ట్ చేసి మాట్లాడగా.. అవతలి వ్యక్తులు హిందీలో మాట్లాడారు.  ఈ నేపథ్యంలోనే ఆ నేరగాళ్లు తమని తాము పోలీస్ ఆఫీసర్స్ గా పరిచయం చేసుకున్నారు.

Cyber crime

ఆనంతరం ఆ యువతికి మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని భయపెట్టారు. అంతేకాకుండా.. రూ.10 వేలు ఇస్తే వెంటనే ఈ కేసు నుంచి తప్పించి వదిలేస్తామని, అలా చేయకుంటే.. కాళ్లు, చేతులు నరికేసి జైలులో వేస్తామని బెదిరించారు. అయితే మొదట ఈ బెదిరింపులకు కాస్త ఆశ్చర్యానికి గురైన  ఆ తర్వాత మాత్రం.. సైబర్ నేరగాళ్లు యువతి తండ్రి పేరు, కుటుంబీకుల వివరాలు ఉన్నది ఉన్నట్లు  చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. దీంతో తన తండ్రిని నిజంగానే పోలీసులు అరెస్టు చేశారని నమ్మిది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుకున్న సైబర్ నేరగాళ్లతో కాళ్ల బేరానికి వచ్చి తన వద్ద రూ. 5 వేలే ఉన్నాయని వేడుకుండి. అనంతరం పక్కింట్లోకి వెళ్లి వారితో ఫోన్ మాట్లాడించింది. ఇక వారు కూడా యువతి తండ్రితో మాట్లాడించాలని కోరారు.  కానీ, సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా యువతి తండ్రి ఏడుస్తున్నాడంటూ ఏడుపు శబ్ధం వినిపించారు.  పైగా  ఇప్పుడు రూ. 5 వేలు పంపించు, తర్వాత మిగిలినవి  మళ్లీ పంపించండి అంటూ సీరియస్‌గా ఫోన్ పెట్టేశారు.

కానీ, అనుమానం వచ్చిన యువతి కంగారు పడుతూ తన తండ్రికి ఫోన్ చేయగా.. ఆయన బాగానే ఉన్ననని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఈ సంఘటన గురించి సైబర్ క్రైం పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్లు రూట్ మార్చి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, ఒకవేళ ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని, వెంటనే సమీపంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరీ, సినిమా రేంజ్ లో సైబర్ నేరానికి పాల్పడిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.