Keerthi
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిచాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మంచి విద్యను అందించడానికి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లలో చేర్పిస్తారు. కానీ , ఆ ప్రైవేట్ స్కూల్లలో ఫీజుల దోపిడి అనేది రోజు రోజుకి మితిమీరిపోతుంది. తాజాగా ఓ పాఠశాలలో సకాలంలో ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిచాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మంచి విద్యను అందించడానికి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లలో చేర్పిస్తారు. కానీ , ఆ ప్రైవేట్ స్కూల్లలో ఫీజుల దోపిడి అనేది రోజు రోజుకి మితిమీరిపోతుంది. తాజాగా ఓ పాఠశాలలో సకాలంలో ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Keerthi
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. అందుకోసం వారికి మొదటగా మంచి విద్యను అందించాలని తపన పడుతుంటారు. ఈ క్రమంలోనే మంచి విద్యను అభ్యసించడానికి .. ప్రైవేట్ స్కూల్లలో చేర్పించాలని అనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి కుటుంబానికి స్థోమతకు మించిన విషయం అయిన తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వేలకు వేలు ఖర్చు పెడుతూ.. బెస్ట్ స్కూల్స్ లో చేర్పిస్తారు. ఇక ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే అదనుగా తీసుకొని భారీ మొత్తంలో ఫీజులను వసూళ్లు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఫీజ్ చెల్లింపులో విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేసిన ఈ ప్రైవేట్ యాజమాన్యం తమ ప్రతాపాన్ని విద్యార్థుల మీద చూపిస్తారు. తాజాగా ఇలానే విద్యార్థులు ఫీజులు కట్టాలేదని రంగరెడ్డిలో ప్రైవేట్ యాజమాన్యం ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రైవేట్ పాఠశాల్లో ఫీజుల దోపిడి రోజు రోజుకి మితిమీరిపోతుంది. అంతేకాకుండా సమయానికి ఫీజులు కట్టడంలేదనే కారణంతో యాజమాన్యం విద్యార్థుల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం విద్యార్థుల చదువులకు భారీ ఫీజులు వసూళ్లు చేయకుడాదని హెచ్చరించిన ప్రైవేట్ సంస్థలు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతున్నాయి. దీనితో పాటు సమయానికి ఫీజులు కట్టడంలేదని విద్యర్థులను ఎండాల్లో నిలబెట్టడం, స్కూల్లకు రానించకపోయిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక హై స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం లేదంటూ విద్యార్థులపై తప ప్రతాపం చూపెట్టారు. కాగా, ఉదయం మంచాల, యాచారం మండంలని పలు గ్రామాల నుంచి ఉదయం స్కూల్‌కు వచ్చిన బస్‌లో కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేదని.. వారిని అలాగే బస్‌లోనే కూర్చిబెట్టారు పాఠశాల సిబ్బంది.
దీంతో ఆ స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసిన బస్‌లో ఆ చిన్నారులు అలాగే ఉండిపోయారు. తీవ్ర ఎండలోనూ చిన్నారులు అదే బస్‌లో ఆ పిల్లలు ఉండిపోవడంతో.. ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు వీడియోలు తీయగా.. విద్యార్థులను తిరిగి తరగతి గదిలోకి తీసుకెళ్లారు. దీంతో.. ఫీజుల దోపిడీకి పాల్పడుతూ, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను అంతా కఠినంగా తీవ్ర ఎండలో బస్సుల్లో ఉంచిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.