iDreamPost

రేషన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి!

  • Published Apr 15, 2024 | 10:36 AMUpdated Apr 15, 2024 | 10:36 AM

Ration Card E Kyc Process: పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందడానికి తప్పని సరిగా రేషన్ కార్డు ఉండాలి. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన వారికి రేషన్ అందేలా చర్యలు చేపట్టింది.

Ration Card E Kyc Process: పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందడానికి తప్పని సరిగా రేషన్ కార్డు ఉండాలి. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన వారికి రేషన్ అందేలా చర్యలు చేపట్టింది.

  • Published Apr 15, 2024 | 10:36 AMUpdated Apr 15, 2024 | 10:36 AM
రేషన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి!

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందడాకిని రేషన్ కార్డు ఎంతో ముఖ్యం. రేషన్, వివిధ పథకాల లబ్ది పొందాలంటే తప్పని సరి రేషన్ కార్డు ఉండాలి. ఇటీవల రేషన్ కార్డు విషయంలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల కోసం కెటాయించిన రేషన్ కార్డులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, డబ్బు ఉన్నవాళ్లు సైతం వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పకడ్బందీగా చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పని సరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేవైసీ గురించి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..

దేశంలో పేద ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అర్హులైన వారికి అందేలా కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇందులో బాగంగా రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ తప్పని సరి చేసింది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఈ కేవైసీ అందుబాటు లో ఉన్న రేషన్ షాపులకు వెళ్లి చేసుకునే సౌకర్యం కల్పించింది. వేలి ముద్రల ఆధారంగా కుటుంబంలోని సభ్యుడా? కాదా? అన్న విషయాలను ఈ కేవైసీ ద్వారా గుర్తించవొచ్చు. తద్వారా రేషన్ బియ్యం సరుకులు సక్రమంగా అర్హులైన వారికి అందుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఫిబ్రవరి 29 తో ఈ-కేవైసీ ప్రక్రియ ముగిసింది. కానీ దేశ వ్యాప్తంగా చాలా మంది ఈ-కేవైసీ సరైన సమయానికి చేయలేకపోయారు. తాజాగా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  ఫిబ్రవరి29 తో ముగిసిన గడువు తిరిగి కొనసాగించే ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ గడువు ఈ-కేవైసీ కి మరో అవకాశం కల్పించింది. వాస్తవానికి ప్రభుత్వం తుది గడువు విధించలేదని.. ఆ లోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.  ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ-కేవైసీ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ సేవా, ఆధార కేంద్రాలకు వెళ్లి అప్డేట్ పూర్తి చేసుకున్నా ఈ-కేవైసీ ప్రక్రియ లో వేలిముద్రలు రావడం లేదని వాపోతున్నారు.  కొంతమంది రేషన్ డీలర్లు ఈ-కేవైసీ ప్రక్రియ చేయడానికి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లబ్దిదారుల్లో 74.6 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తింది. మీరు ఈ-కేవైసీ చేయకుంటే వెంటనే దగ్గరలోని రేషన్ షాపు, ఈ సేవ కు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి