P Krishna
KCR to the Assembly Today: తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని ప్రవేశపెట్టనుంది.. ప్రతిపక్ష హోదాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
KCR to the Assembly Today: తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని ప్రవేశపెట్టనుంది.. ప్రతిపక్ష హోదాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
P Krishna
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలన కొనసాగించింది. ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల కాలానికి బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ.. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత రెండు నెలల రెస్ట్ తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ని ప్రవేశపెట్టనుంది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేడు అసెంబ్లీలోకి మాజీ సీఎం కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడి హూదాలో ఉండబోతున్నారు. అసెంబ్లీ సెషన్స్ మొదలనప్పటికీ.. రెండు రోజులుగా ఆయన సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు బీఆరఎస్ శ్రేణులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై అటు నాయకుల్లో ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలిచారు.. అయతే డిసెంబర్ 8న కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లో బాత్రూంలో కాలుజారి పడిపోయారు.. దీంతో ఆయన తొంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ చేతి కర్రతో నడుస్తున్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో తనదైన పాలన కొనసాగించిన కేసీఆర్.. ప్రతిపక్ష హోదాలో ఎలా ఉండబోతున్నారు.. అధికార పార్టీని ఎలా నిలదీయబోతున్నారో ప్రజల్లో ఆసక్తి మొదలైంది. కేసీఆర్ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న విషయంపై గులాబీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.