iDreamPost
android-app
ios-app

విషాదం: గుండెపోటుతో DCP కుమారుడు మృతి!

ఇటీవల కాలంలో ఎక్కువ వినిపించే పేరు గుండె పోటు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకుఅందరిలో ఈ హార్ట్ స్ట్రోక్ అనేది వస్తోంది. తాజాగా ఓ డీసీపీ కుమారుడు కూడా ఈ గుండె పోటుకు బలయ్యాడు.

ఇటీవల కాలంలో ఎక్కువ వినిపించే పేరు గుండె పోటు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకుఅందరిలో ఈ హార్ట్ స్ట్రోక్ అనేది వస్తోంది. తాజాగా ఓ డీసీపీ కుమారుడు కూడా ఈ గుండె పోటుకు బలయ్యాడు.

విషాదం: గుండెపోటుతో DCP కుమారుడు మృతి!

గుండెపోటు.. ఈపేరు వింటేనే ప్రతి ఒక్కరిలో తెలియని భయం వెంటాడుతోంది. అందుకు కారణంగా దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వయస్సుతో నిమిత్తం లేకుండా పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరూ ఈ హార్ట్ స్ట్రోక్ కి గురవుతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వారు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా కేవలం సామాన్యులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దీని కారణంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా ఓ  డీసీపీ కుమారుడు గుండె పోటు కారణంగా మరణించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ లోని సెంట్రల్ జోన్ డీసీపీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చంద్రతేజ్(25) అనే కుమారుడు ఉన్నాడు. చంద్రతేజ్ గుండెపోటుకు గురై.. మృతి చెందాడు. సోమవారం రాత్రి సమయంలో చంద్రతేజ్ కి గుండెపోటు  వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చంద్రతేజ్  ప్రాణాలు కోల్పోయాడు. డీసీపీ వెంకటేశ్వర్ల స్వగ్రామం నల్లగొండ జిల్లాలో ఉంది. దీంతో చంద్రతేజ్ మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్గొండ జిల్లాకు తరలించారు.

ఇక చంద్రతేజ్‌ విషయానికి వస్తే.. ఆయన ఓ ప్రైవేటు కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. స్వతహాగా వ్యాపారంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు చంద్రతేజ్ కు కారును కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక చంద్రతేజ్ మృతదేహానికి పలువురు నివాళ్లు అర్పించారు. అంతేకాక డీసీపీ వెంకటేశ్వర్లను  పలువురు అధికారులు ఓదార్చారు. ఇటీవల కాలంలో గుండె పోటు మరణాలు అధికంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఆటలు ఆడుతూ కుర్రాడు గుండెపోటుకి గురై మరణించాడు. అలానే వివాహ వేడుకల్లో పెళ్లి పీటలపై  హార్ట ఎటాక్ తో వరుడు మరణించిన ఘటనలు చాలానే జరిగాయి. ఇలా హార్ట్ స్ట్రోక్ కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.