CI బదిలీ.. కన్నీరు పెట్టుకున్న నిరుద్యోగులు .. కారణం ఏంటంటే!

సాధారణంగా ఏదైనా స్కూల్ నుంచి టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ఇలా ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతుంటే.. అక్కడి వారు బాధపడడం ఇలాంటివి చూసి ఉంటాం . కానీ, ఓ దగ్గర ఎక్సైజ్ సీఐ ట్రాన్ఫర్ అయినందుకు అక్కడి నిరోద్యోగులంతా కన్నీటి పర్యంతం అయ్యారు . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా ఏదైనా స్కూల్ నుంచి టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ఇలా ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతుంటే.. అక్కడి వారు బాధపడడం ఇలాంటివి చూసి ఉంటాం . కానీ, ఓ దగ్గర ఎక్సైజ్ సీఐ ట్రాన్ఫర్ అయినందుకు అక్కడి నిరోద్యోగులంతా కన్నీటి పర్యంతం అయ్యారు . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటివరకు ఏదైనా స్కూల్ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ.. ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతుంటే .. అక్కడి విద్యార్థులు .. కన్నీటితో వీడ్కోలు ఇవ్వడం .. వారిని విడువలేకపోవడం ఇలాంటి సన్నివేశాలు చూసే ఉంటాం. దానికి కారణం ఆయా ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏర్పరుచుకున్న అనుబంధం.. అలానే వారికీ జీవిత పాఠాలు చెప్పిన తీరు . కానీ, ఇక్కడ ఒక ఎక్సైజ్ సీఐ ట్రాన్ఫర్ అయ్యి వెళ్లిపోతుంటే .. అక్కడి నిరుద్యోగులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. మరి వారికీ, అక్కడ ఉద్యోగ రీత్యా పనిచేసే ఓ ప్రభుత్వ అధికారికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి! వారంతా ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు! అనే విషయాలు తెలుసుకుందాం.

అందరి హృదయాలను ఆలోచింపచేసేలా జరిగిన ఈ సంఘటన.. నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ గత ఆరున్నర సంవత్సరాలుగా ఏడుకొండలు అనే వ్యక్తి ఎక్సైజ్ సీఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. సాధారణంగా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా .. లేదా ఏ ప్రభుత్వ అధికారి అయినా వారి వారి విధులను మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఇంకా మంచి జీతం తీసుకుంటూ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. కానీ, ఏడుకొండలు మాత్రం వారందరికీ కాస్త భిన్నంగా చేశాడు. అందుకే, ఈ వ్యక్తి అందరికి ఆదర్శంగా వార్తల్లో నిలిచాడు.

ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడంటే .. తానూ ఉద్యోగాన్ని సంపాదించే క్రమంలో.. పడిన కష్టాలు .. ఎదుర్కొన్న ఆటుపోట్లు మిగిలిన నిరుద్యోగ యువత పడకూడదని. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే పేద విద్యార్థులకు అండగా నిలిచాడు ఈ పోలీస్ ఆఫీసర్. వారికోసం ఊరిలో “ది మిషన్” అనే సంస్థను స్థాపించి.. తానే స్వయంగా వారికీ కోచింగ్ ఇచ్చేవాడు. ఓ పక్క తన విధులను నిర్వహిస్తూనే.. ఖాళీ సమయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు.. ఉచితంగా శిక్షణ ఇచ్చేవాడు. పరోక్షంగా ఎంతో మంది నిరుద్యోగులకు సహాయంగా నిలిచాడు ఈ పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో అతడు వృత్తి రీత్యా బదిలీ అవ్వడంతో.. అక్కడి నిరోద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు. మరి, ఇంతటి గొప్ప పని చేస్తున్న ఆ ఎక్సైజ్ సీఐ ఆఫీసర్ కు నిజంగా అందరు సెల్యూట్ చేయాల్సిందే. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments