iDreamPost

PhonePe, G Payలో కాకుండా.. ఏ వెబ్సైట్ లో కరెంట్ బిల్ కట్టాలి…?

TGSPDCL Current Bill: తెలంగాణ విద్యుత్  శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో కరెంట్ బిల్లుల చెల్లింపును నిలిపివేసిన సంగతి తెలిసింది. కేవలం టీజీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించింది.

TGSPDCL Current Bill: తెలంగాణ విద్యుత్  శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో కరెంట్ బిల్లుల చెల్లింపును నిలిపివేసిన సంగతి తెలిసింది. కేవలం టీజీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించింది.

PhonePe, G Payలో కాకుండా.. ఏ వెబ్సైట్ లో కరెంట్ బిల్ కట్టాలి…?

నేటికాలంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి.  చాలా మంది ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. శ్రమ తక్కువగా ఉండటం, టైమ్ ఆదా అవుతుండటంతో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ వైపు  ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే దాదాపు ప్రతి కొనుగోలు విషయంలోనే సర్వీస్ ప్రొవైడర్లను వినియోగించి..ఆన్ లైన్ చెల్లింపులు చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా(RBI) సూచనల మేరకు తెలంగాణ విద్యుత్  శాఖ  ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో కరెంట్ బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. కేవలం  టీజీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించింది. అయితే మరి.. ఎలా చెల్లించాల్లో, ఆ ప్రాసెస్ ఎమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణలో విద్యుత్ పంపిణీని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్ పీడీసీఎల్) నిర్వహిస్తుంది. అత్యున్నత భద్రత, సౌకర్యాలతో వెబ్‌సైట్‌లో కరెంట్ చెల్లింపు ఆన్‌లైన్‌లో ఈజీగా చేయవచ్చు. గతనెలవరకు కస్టమర్లు కరెంట్ బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వారికి వీలైన పద్ధతుల్లో చెల్లించేవారు. కానీ జులై 1 నుంచి యూపీఐ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లింపులు టీజీఎస్ పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనల మేరకు సర్వీస్ ప్రొవైడర్ యాప్స్ ద్వారా చెల్లింపులను టీజీఎస్ పీడీసీఎల్ నిలిపివేసింది. టీజీఎస్ పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ లో గానీ, యాప్ ద్వారా మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.

టీజీఎస్ పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో కరెంట్ బిల్లు చెల్లించే విధానం:

  • టీజీఎస్ పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ అయినా https://tgsouthernpower.org/ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
  • అక్కడ హోమ్ పేజీలో Consumer Services  అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తరువాత ఈ Consumer Services కుడివైపున కనిపించే పే యువర్ బిల్ మీద క్లిక్ చేయండి
  • క్రింద ఇచ్చిన ప్లేసులో వినియోగదారుడు తమ యూనిక్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  •  మీరు మీ విద్యుత్ బిల్లును చూపే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉండే పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • అక్కడ కరెంట్ బిల్లుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఈ క్రమంలోనే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఓటీపీని ఎంటర్ చేసి, చెల్లింపును ప్రాసెస్ చేయాలి
  • ఇక బిల్లు చెల్లింపు పూర్తయిన తర్వాత  ఈ-రసీదు పొందవచ్చు. అంతేకాక ఆ బిల్లును సేవ్ చేసుకోవాలి.

టీజీఎస్ పీడీసీఎల్ మొబైల్ యాప్‌తో కరెంట్ బిల్లు చెల్లింపు విధానం:

  •  కరెంట్ బిల్లు చెల్లించే వినియోగదారుడి స్మార్ట్ ఫోన్ లో యాప్ లేకపోతే టీజీపీడీసీఎల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి
  •   అలా మొదట TGSPDCL యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
  •  విద్యుత్ బిల్లు చెల్లించేందుకు కస్టమర్ యూనిక్ సర్వీసు నంబర్ తో ఖాతాను ఓపెన్ చేయాలి.
  •  యాప్ లోని అప్లికేషన్ స్క్రీన్ పై ఉన్న ‘పే యువర్ పవర్ బిల్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
  •  కరెంట్ బిల్లు మొత్తాన్ని పొందడానికి అప్లికేషన్‌పై కస్టమర్ యూనిక్ నంబర్, ఫోన్ నంబర్‌ ఎంటర్ చేయాలి.
  • పేమెంట్ ఆప్షన్ లతో పాటు కస్టమర్  చెల్లించాల్సిన కరెంట్ బిల్లు చూపిస్తుంది.
  • నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లు, UPI వంటి వాటితో ఏదో ఒక దానితో పేమెంట్ చేసుకోవచ్చు.
  •   చివరగా బిల్లు పే చేసిన తరువాత ఈ-రసీదు వస్తుంది .
  • చివరకు మనం చెల్లించిన బిల్లుకు సంబంధించిన ఈ-రసీదును డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.

మొత్తంగా కరెంట్ బిల్లును టీజీఎస్ పీడీసీఎల్ కు సంబంధించిన సైట్, యాప్ వంటి వాటి ద్వార జులై నెల నుంచి కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి