Arjun Suravaram
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా శ్రద్ద పెట్టే అతి ముఖ్యమైన వాటిల్లో విద్యావ్యవస్థ ఒకటి. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ కి కీలక ఆదేశాలను జారీ చేసింది.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా శ్రద్ద పెట్టే అతి ముఖ్యమైన వాటిల్లో విద్యావ్యవస్థ ఒకటి. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ కి కీలక ఆదేశాలను జారీ చేసింది.
Arjun Suravaram
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థ బలోపేతం కోసం తరచూ వివిధ కీలక నిర్ణయం తీసుకుంటాయి. అకాడమిక్ ఇయర్, అలానే సెలవులు, పరీక్షల విధానం వంటి వాటి గురించి కీలక విషయాలను వెల్లడిస్తుంటాయి. అలానే సిలబస్ కి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే 2024-25 ఏడాది విద్యాసంవత్సరంకి సంబంధించిన విషయాలను ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సర్కార్ బడులకు సంబంధించి ఓ విషయంలో కీలక ఆదేశాలను జారీ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ స్కూల్స్ కి విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. జూలై 20న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలనే నిర్ణయించింది. తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే థీమ్ తో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ పేరెంట్ టీచర్ సమావేశానికి రావాలని అన్నీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం ఇవ్వాలని విద్యాశాఖ తెలిపింది. అందుకు సంబంధించిన సర్కులర్ ను కూడా జారీ చేసింది. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న వారి వివరాలు మండల, జిల్లాల అధికారులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా గ్రామీణ, పట్టణ వ్యత్యాసం లేకుండా విద్యార్థులందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకే తరచూ విద్యావ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యా వ్యవస్థలో టీచర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. అందుకే వారితో కూడా సమావేశాలు నిర్వహించి.. కీలకమైన విషయాల గురించి చర్చించేలే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తాజాగా టీచర్, పేరంట్స్ మీటింగ్ ను తప్పనిసరిగా చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి..తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.