iDreamPost
android-app
ios-app

మండుతున్న ఎండలు.. జనాలకు భారీ షాకిచ్చేందుకు రెడీ అయిన TSRTC

  • Published Apr 16, 2024 | 1:39 PM Updated Updated Apr 16, 2024 | 1:39 PM

మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలకు టీఎస్ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలకు టీఎస్ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 16, 2024 | 1:39 PMUpdated Apr 16, 2024 | 1:39 PM
మండుతున్న ఎండలు.. జనాలకు భారీ షాకిచ్చేందుకు రెడీ అయిన TSRTC

గత వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిశాయి. దాంతో 5-6 రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. దాంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఇక ఆదివారం నుంచి భానుడు మళ్లీ ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. మండే ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు టీఎస్ఆర్టీసీ జనాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడి పోతున్నారు. వడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండల తీవ్రత ప్రభావం.. టీఎస్ఆర్టీసీ మీద కూడా పడింది. హైదరాబాద్‌లో రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో అనగా.. మధ్యాహ్నం 12-4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు.

TSRTC

పెరిగిన ఎండల కారణంగా.. సాధారణంగానే మధ్యాహ్నాం వేళల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని.. అందుకే ఆ సమయంలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈనెల 17 నుంచి బస్సు సర్వీసుల తగ్గింపు నిర్ణయం అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని.. ఆర్టీసీతో సహకరించాలని కోరారు.

కాగా, నేడు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించాు. ప్రస్తుతం 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. వచ్చే రెండ్రోజులు అదనంగా మరో 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు. వడగాలులు కూడా వీస్తాయని.. కనుక ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య అత్యవసరమైతే తప్ప బయకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఒకవేళ రావాల్సి వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇండ్లలో ఉండే వారు కూడా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎక్కువగా నీరు తాగాలని.. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదని.. వెళ్లినా.. గొడుకు కచ్చితంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.