iDreamPost
android-app
ios-app

రూ.100 కోసం.. రెండు ఏటీఎంలు పగులగొట్టిన మందుబాబు!

మద్యం తాగేందుకు వెళ్లిన వ్యక్తి.. కొంత తాగిన తర్వాత డబ్బులు లేకపోవడంతో సమీపంలోని ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసేందుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి ఏటీఎం కార్డు పెట్టి.. పిన్ నంబర్ ఎంటర్ చేయగా.. డబ్బులు లేవని వచ్చింది. దీంతో

మద్యం తాగేందుకు వెళ్లిన వ్యక్తి.. కొంత తాగిన తర్వాత డబ్బులు లేకపోవడంతో సమీపంలోని ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసేందుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి ఏటీఎం కార్డు పెట్టి.. పిన్ నంబర్ ఎంటర్ చేయగా.. డబ్బులు లేవని వచ్చింది. దీంతో

రూ.100 కోసం..  రెండు ఏటీఎంలు పగులగొట్టిన మందుబాబు!

మద్యం ప్రియులకు మందు ఓ ఎమోషన్. శాలరీతో పని లేదు.. పగలు తేడా అనే వ్యత్యాసం లేదు, ఎప్పుడు తాగాలని అనిపిస్తే.. అప్పుడు బార్ షాపుల ముందు ప్రత్యక్షమవ్వాల్సిందే. అయితే చేతిలో చిల్లీ గవ్వ ఉంటేనే నోట్లో చుక్కపోయేది. దీంతో డబ్బుల కోసం తన సంపాదనను తగలబెట్టడం లేదంటే తాగేందుకు కాసులివ్వాలని భార్యను హింసించడం, ఆమె నగలు తాకట్టుపెట్టడం, పిల్లల ఫీజుల డబ్బులు లాక్కోవడం అవసరమైతే దొంగతనాలు, దోపిడీలకు కూడా పాల్పడుతుంటారు. ఏదైమైనా సాయంత్రానికి కడుపులో పడిపోవాల్సిందే. లేకపోతే మనస్సు ప్రశాతంగా ఉండదు. తాజాగా ఓ మందు బాబు కాస్త తీర్థం పుచ్చుకుని.. ఇంకొంత తాగేందుకు డబ్బులు లేకపోడంతో ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసేందుకు వెళ్లాడు. కానీ ఏటీఎంలో నుండి డబ్బులు రాకపోవడంతో కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేశాడు.

ఈ ఘటన సిద్ది పేట జిల్లా రామాయం పేట పట్టణంలో చోటుచేసుకుంది.  పోలీసులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయం పేటకు చెందిన షాదక్ అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం సేవించాడు. డబ్బులు అయిపోవడంతో తన వద్ద ఉన్న ఏటీఎం కార్డు నుండి డబ్బు డ్రా చేసి మద్యం కొనుగోలు చేయాలనుకున్నాడు.  ఈ క్రమంలోనే సిద్దిపేట చౌరస్తాలో ఉన్న ఓ ఏటీఎంలో వంద రూపాయలు తీసేందుకు  వెళ్లాడు. అందులో డబ్బులు రాలేదు.  దీంతో మద్యం మత్తులో ఉన్న షాదక్.. ఆ ఏటీఎం మెషీన్‌ను పగులగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం పక్కనే ఉన్న మరో ఏటీఎం దగ్గరికి వెళ్లాడు. అయితే కార్డు పెట్టి పిన్ నంబర్ కొట్టగానే అక్కడ కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.

దీంతో తీవ్ర అసహనానికి గురైన షాదక్.. బయటకు వచ్చి..  ఓ బండరాయి తీసుకువచ్చి.. ఆ ఏటీఎం మెషీన్‌ను పగులకొట్టాడు. అయితే రెండు ఏటీఎం మెషీన్లు ధ్వంసం కావడంతో  సదరు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఈ పని చేశాడని, ఎవరో దొంగ పని అనుకున్నారు.  ఏటీఎంకు సమీపంలో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ పరిశీలించగా ఈ  రెండు ఓ వ్యక్తి పనే అని తేలింది. ఆ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసింది షాదక్ ఒక్కడే అని పోలీసులు గుర్తించారు. రెండు ఏటీఎంలలోకి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా.. రాకపోవడంతో వాటిని ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు.  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షాదక్ కోసం వెతుకుతున్నారు.