మారని మెడికల్ షాపుల తీరు.. భారీ ధరకు మందులు అమ్మకం!

గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా  తనిఖీలు చేస్తున్నారు.  నిబంధనలు పాటించిన మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా మెడికల్ షాపు తీరు మారడం లేదు.

గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా  తనిఖీలు చేస్తున్నారు.  నిబంధనలు పాటించిన మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా మెడికల్ షాపు తీరు మారడం లేదు.

ఇటీవల కాలంలో తెలంగాణలో వివిధ రకాల రంగాలపై అధికారులు దాడులు చేశారు. అవినీతి,అక్రమాలకు పాల్పడే వారికి ఒంట్లో వణుకు పుట్టించారు. ఆహార నాణ్యత. వైద్యం, లంచం వంటి అనేక కీలకమైన విషయాలకు సంబంధించిన వాటిపై తెలంగాణ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనేక సంచలన విషయాలు మోసాలు వెలుగులోకి వచ్చాయి. అలానే మెడికల్ రంగంలో జరుగుతున్న మోసాలను కూడా అధికారులు గుర్తించారు. అంతేకాక నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడ ఝుళిపించారు. ఇంత చేసిన కొన్ని మెడికల్ షాపుల తీరు మారడం లేదు. భారీగా మందుల ధరలు పెంచి..సామాన్యులను దోచుకుంటున్నాయి. తాజాగా అధికారులు చేసిన దాడులు మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా  తనిఖీలు చేస్తున్నారు.  నిబంధనలు పాటించిన మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మరికొన్ని షాపుల విషయంలో అయితే ఏకంగా సీజ్ చేస్తున్నారు. ఇలా అధికారులు కొరడ ఝుళిపిస్తున్నా కూడా మెడికల్ షాపుల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని జలగల్లా పట్టి పీడిస్తున్నారు.  అందిన కాడికి సామాన్యుల నుంచి దోపిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు చేశారు. ఈక్రమంలో మెడికల్ షాపు దారుణులు వెలుగులోకి వచ్చాయి. క్యాన్సర్ నిరోధక మందులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

క్యాన్సర్ మందులను డబుల్ ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. మెడికల్ షాపులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం హైదరాబాద్, కరీంనగర్లోని పలు మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు దాడులు చేశారు. అధిక ధరకు మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై కేసులు నమోదు చేశారు.  క్యాన్సర్ నిరోధక  ఔషధాలను అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. 200 శాతం అధిక ధరలకు క్యాన్సర్ మందులను విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్, కరీంనగర్లోని పలు మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నా కూడా కొందరిలో మార్పులు రావడం లేదు. ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

Show comments