P Krishna
ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న నాయకులను కొత్తగా పోటీ చేసిన యువ నేతలు ఓడించారు.
ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న నాయకులను కొత్తగా పోటీ చేసిన యువ నేతలు ఓడించారు.
P Krishna
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో కొంతమంది యువ నాయకులు తమ సత్తా చాటారు. వారిలో ఒకరు మామిడాల యశస్విని రెడ్డి. రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి.. కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా యశస్విని రెడ్డి పోటీ చేసింది. ఈమె వయస్సు 26 సంవత్సరాలు. కాగా, ఈమెకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా.. 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై.. ఊహించని మెజారిటీతో ఘన విజయం సాధించింది. దీనితో తెలంగాణ రాజకీయాల్లో ఈమె ఒక సంచలనంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. సోషల్ మీడియాలో కూడా యశస్విని రెడ్డికి ఒక్కసారిగా అభిమానులు పెరిగారు. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత విషయాలు, చిన్ననాటి ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా, యశస్విని రెడ్డి పెళ్లి నాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యశస్విని రెడ్డి విషయానికొస్తే.. స్వతహాగా ఆమె ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అమ్మాయి. హైదరాబాద్‌లో తన బి.టెక్ విద్యను పూర్తి చేసుకుంది. ఆ తరవాత 2019లో ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి ల కుమారుడైన రాజా రామ్మోహన్ రెడ్డితో వివాహం జరిగింది. వారి వివాహం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుకలలో రాజా రామ్మోహన్ రెడ్డి, యశస్విని రెడ్డి అనుష్క, ప్రభాస్ గెటప్పులు వేసి డాన్స్ కూడా చేశారు. కన్నుల పండుగగా జరిగిన వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామజిక మాధ్యమాలలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం యశస్విని రెడ్డి అభిమానులు వీటిని షేర్ చేస్తూ.. ఆమెను ప్రశంసిస్తున్నారు. వివాహ అనంతరం ఆమె తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్ళిపోయింది.
కాగా, యశస్విని రెడ్డి భర్త కుటుంబానికి అమెరికాలో రియలెస్టేట్ వ్యాపారం ఉంది. వివాహ అనంతరం ఆమె అమెరికాకు వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటుంది. ఈ క్రమంలో యశస్విని రాజకీయ అరంగేట్రం అనూహ్యంగా జరిగింది. యశస్విని అత్త అయిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి.. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఝాన్సీరెడ్డి. పాలకుర్తిలో టికెట్ కోసం ప్రయత్నించగా పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో.. కోడలు యశస్విని రెడ్డిని ఎన్నికల బరిలో దింపారు. అనుకోని విధంగా యశస్విని రెడ్డి గెలుపొందింది.
ఇక ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు యశస్విని పేరు మారుమోగుతోంది. ఏదేమైనా, ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా సరే, చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చి.. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది మామిడాల యశస్విని రెడ్డి. ప్రస్తుతం ఈమెకు సంభందించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి, యశస్విని రెడ్డి పెళ్ళినాటి వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.