iDreamPost

గ్యాస్ సబ్సిడీ కోసం e-KYC ఆన్ లైన్‌‌లో చేసుకోండిలా.. చాాలా సింపుల్

తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ సర్కార్.. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీపై పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అమలుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ సర్కార్.. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆరోగ్య శ్రీపై పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అమలుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

గ్యాస్ సబ్సిడీ కోసం e-KYC ఆన్ లైన్‌‌లో చేసుకోండిలా.. చాాలా సింపుల్

తాము అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్న కాంగ్రెస్‌కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది సర్కార్. రెండు గ్యారెంటీలను ప్రారంభించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే.. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అని ప్రకటించగా.. తర్వలో ఈ పథకాన్ని షురూ చేసే అవకాశాలున్నాయి. ఈ పథకం అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు కూడా. తొలుత రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా లబ్దిదారుల ఎంపిక చేయాలన్న నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇ-కేవైసీ చేసిన వారికే రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తారని, లేని వారికి పూర్తిగా డబ్బులు కట్టాలని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్దకు, మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు ప్రజలు. కొన్ని సార్లు వ్యయ ప్రయాసాలు కూర్చుకుని వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడకు వెళ్లాక.. బారులు తీరిన జనాలను చూసి.. ఆందోళన చెందుతున్నారు. ఆ క్యూలో నిలబడలేక ఇబ్బందికి గురౌతున్నారు. కొన్ని సార్లు సాంకేతిక లోపాలు తలెత్తితే.. రెండు, మూడు రోజుల పాటు ఏజెన్సీ, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ఎక్కడకు తిరగకుండానే.. ఇ-కేవైసీ చేసుకునే చక్కనైన ఉపాయం ఒకటి ఉంది. ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా గ్యాస్ ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చచు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్-E-KYC ఎలా పూర్తి చేయాలంటే..?

  • ముందుగా  ఎల్ పీజీ గ్యాస్ అధికారిక వెబ్ సైట్ www.mylpg.inకి వెళ్లాలి.
  • కుడి వైపున భారత్, HP, ఇండియన్ గ్యాస్ సిలిండర్ పిక్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నంబర్‌తో సైన్ ఇన్ అవ్వాలి. లేకుంటే న్యూ యూజర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పై మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
  • లెఫ్ట్ సైడ్ కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రాగానే.. ఆ నంబర్ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటీకేషన్ పూర్తయ్యిందని సందేశం వస్తుంది.
  • మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేసుకోవచ్చు
  •  అప్పుడు ఇ-కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అనే మెసేజ్ వస్తుంది.

ఇక ఆఫ్ లైన్ అయితే.. ఆయా గ్యాస్ ఏజెన్సీలు, మీ సేవా సెంట్లరకు వెళ్లి సంబంధింత ఫారమ్ నింపి ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. వారం రోజుల్లో మీ కేవైసీ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి