Keerthi
ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. వాతవరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలామంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతుంటారు. అంతేకాకుండా.. ఈ వర్షా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దోమ కాటు వలన డెంగ్యూ వంటి జ్వరం బారినపడి ఆసుపత్రులకు చేరితున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని RR జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ముఖ్యంగా పగటి పూట కుట్టిన ఆ దోమ వలనే ఎక్కువగా ఈ ప్రాణంతక జ్వరం బారినపడుతున్నారని దీని వలన ఎలా జాగ్రత్త పడాలి దాని లక్షణాలేంటో కూడా వివరించారు.
ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. వాతవరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలామంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతుంటారు. అంతేకాకుండా.. ఈ వర్షా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దోమ కాటు వలన డెంగ్యూ వంటి జ్వరం బారినపడి ఆసుపత్రులకు చేరితున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని RR జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ముఖ్యంగా పగటి పూట కుట్టిన ఆ దోమ వలనే ఎక్కువగా ఈ ప్రాణంతక జ్వరం బారినపడుతున్నారని దీని వలన ఎలా జాగ్రత్త పడాలి దాని లక్షణాలేంటో కూడా వివరించారు.
Keerthi
ప్రస్తుతం వర్షకాలం కావడంతో ఎక్కడ చూసిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. దీంతో వాతవరణంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక వాతవరణంలో జరిగే మార్పులు కారణంగా.. చాలామంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతుంటారు. అంతేకాకుండా.. ఈ వర్షా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఏ మూల చూసిన విపరీతమైన దోమలు దర్శనిమిస్తుంటాయి. ఇక ఈ దోమ కాటులకు గురైన వారికి ఆకస్మాత్తుగా జ్వరం వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని RR జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వర్ రావు తెలిపారు. అంతేకాకుండా.. ఈ జ్వరం బారినపడినవారు ఎలా జాగ్రత్త పడాలి దాని లక్షణాలేంటో కూడా వివరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా డెంగ్యూ ముప్పు పొంచి ఉందని తెలంగాణ RR జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఎందుకంటే.. ఓ వర్షాలతో పాటు వాతవరణంలో కారణంగా నగరంలో దోమల బెడద ఎక్కువైందని దీని వలన చాలామంది ఆనారోగ్యం గురవుతున్నరని తెలిపారు. ముఖ్యంగా ఈ దోమలు కుట్టడం వలన డెంగ్యూ సోకుతుందని, అయితే ఇది పగటి పూట మాత్రమే కుడుతుందని తెలిపారు. ఇకపోతే దోమ కుట్టిన 7 నుంచి 8 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుందని, లక్షణాలు గుర్తించిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యాధికారి తెలిపారు. అంతేకాకుండా..ఈ డెంగీ కారక దోమల బెడద నుంచి రక్షించుకోవడమే శ్రేయస్కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం సమీపంలో దోమల ఉత్పత్తికి కారణమయ్యే నిల్వ నీరు లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. నిల్వ ఉన్న నీటీలోనే దోమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఇక దోమల వలన వచ్చే డెంగీ జ్వరం చాలా ప్రమాదకరమని, ఒకవేళ జ్వరం లక్షణాలు ఉంటే ముందుగా అప్రమత్తం అవ్వడం మంచిదని తెలిపారు. ముఖ్యంగా ఈ డెంగీ జ్వరం వస్తే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ డెంగీకి దోహదం చేసే ఏడిస్ ఈజిప్టి అనే దోమనే ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో దోమలు కుట్టకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయని గ్రహించాలి. వీలుంటే ఆయా శరీర భాగాల్లో మనకు మార్కెట్లో లభించే దోమల నివారణ క్రీమ్స్ ను పూయాలి. అంతేకాకుండా.. మార్కెట్లో దోమలను బయటకు తరిమికొట్టేందుకు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో చాలా వరకూ పరోక్షంగా ఆరోగ్యానికి హాని కలిగించేవే. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి.