iDreamPost
android-app
ios-app

తెలంగాణలో.. ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో

  • Published Jul 04, 2024 | 3:24 PM Updated Updated Jul 04, 2024 | 3:24 PM

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అమృత్ పథకం కింద 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రైల్వే స్టేషన్ కు ఎయిర్ పోర్ట్ తరహాలో రూపకల్పణతో త్వరలోనే ప్రారంభమైకు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అమృత్ పథకం కింద 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రైల్వే స్టేషన్ కు ఎయిర్ పోర్ట్ తరహాలో రూపకల్పణతో త్వరలోనే ప్రారంభమైకు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 04, 2024 | 3:24 PMUpdated Jul 04, 2024 | 3:24 PM
తెలంగాణలో.. ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో

ఇప్పటికే అమృత్ భారత్ పథకం కింద దేశంలో చిన్న చిన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే దిశగా.. కేంద్ర ప్రభుత్వం ముందడగు వేసిన విషయం తెలసిందే. ఇక ఈ పథకం ద్వారా చిన్న రైల్వే స్టేషన్లలో సైతం ప్రయాణీకులకు మౌలిక సౌకర్యలన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.కాగా, ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకం అనేది భారతీయ రైల్వే నెట్‌వర్క్ అంతటా రైల్వే స్టేషన్‌లను మెరుగుపరచడం, ఆధునీకరించడంమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఇప్పటికే ఈ అమృత్ భారత్ పథకం కింద పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే మొదటి దశ పనుల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. ఇక అందులో రామగుండం రైల్వే స్టేషన్ కూడా ఉంది. కాగా, ఈ స్టేషన్ నుంచి వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తాజాగా రైల్వే శాఖ సిద్ధమైంది. అంతేకాకుండా.. ఈ అమృత్ పథకంలో భాగంగా స్టేషన్‌లో అభివృద్ధి పనులు ముమ్మరం చేశారు. అన్ని హంగులతో త్వరలోనే స్టేషన్ అందుబాటులోకి రానుంది.ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అమృత్ పథకం కింద 21 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు పనులు చేపట్టాగా..  ఫస్ట్ ఫేజ్‌లో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌లను ప్రధాని మోదీ వచ్చే నెలలో వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో ఆయా రైల్వే స్టేషన్లలో పనులను శరవేగంగా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రామగుండం రైల్వే స్టేషన్ కూడా కొత్త రూపుకల్పనకు సంతరించుకుంటుంది. అయితే అందుకోసం సుమారు రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేసన్ రూపు రేఖలు మార్చుతున్నారు. అంతేకాకుండా.. ప్లాట్‌ఫాంతో పాటు ప్రయాణికులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు వేగంగా చేపడుతున్నారు. అందుకోసం రైల్వే స్టేషన్ ముందు భాగంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా ఎలివేషన్ తో పాటు వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎయిర్ పోర్టు తరహాలో.. స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ ఫాం పైకి చేరుకునేందుకు లిఫ్టు సౌకర్యంతో పాటు ముందు భాగంలో నడుచుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రత్యేకత దారిని నిర్మిస్తున్నారు. అయితే దీని కోసం ముందుగానే రైల్వే స్టేషన్ ఎదుట ఎలాంటి ఇతర నిర్మాణాలు ఉండకుండా ముందుగానే వాటన్నింటిని తొలగించారు.అలాగే ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్‌లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని స్పెషల్ డిజైన్ చేస్తున్నారు. ఇక ప్రధాని ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే కాజీపేట-బల్లార్ష మార్గంలో అధిక ఆదాయం వస్తున్న స్టేషన్లలో రామగుండం స్టేషన్ కూడా ఉంది. ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ట్రైన్ ప్రయాణికులు తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. మరి, త్వరలో రాయగుండం స్టేషన్ కొత్త నవీకరణతో ప్రారంభం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş