Dharani
Bhatti Vikramarka-New Crop Loan, Rythu Runa Mafi: తెలంగాణలో పండగా వాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు హర్షం చేస్తున్నారు. ఈక్రమంలో వారికి మరో శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఆ వివరాలు..
Bhatti Vikramarka-New Crop Loan, Rythu Runa Mafi: తెలంగాణలో పండగా వాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు హర్షం చేస్తున్నారు. ఈక్రమంలో వారికి మరో శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన కీలకమైన హామీని అమలు చేసింది. ఆరు గ్యారెంటీల్లో అతి ప్రధానమైన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా లక్ష రూపాయల లోపు రుణం ఉన్న వారి ఖాతాలో నగదు జమ చేసింది. జూలై 18 సాయంత్రం గురువారం నాటికి వారి ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. జూలై 18 నాటికి లక్ష రూపాయల రుణం మాఫీ చేయగా.. రెండో విడతలో భాగంగా నెలాఖరులోపు అనగా.. జూలై చివరి నాటికి.. లక్షన్నర రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపింది.
ఇక ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీని అమలు చేస్తుండటంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. దాంతో డబుల్ బొనాంజా అని రైతన్నలు సంతోషపడుతున్నారు. ఇంతకు ఆ శుభవార్త ఏంటంటే..
ఇప్పటికే లక్ష రూపాయాల రుణమాఫీ పూర్తి చేసిన రేవంత్ సర్కార్.. వెంటనే అన్నదాతలకు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. అంతేకాక.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నిధులను కేవలం రుణమాఫీకే వినియోగించాలని.. ఆ డబ్బును రైతులకు సంబంధించిన వేరే పెండింగులకు మళ్లించకూడదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకోవటమే కాకుండా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయాలని భట్టి ఆదేశించారు. క్రాప్ లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడా అశ్రద్ధ చూపించొద్దని సూచించారు. ఈ విషయంలో లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని ఉపముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు.
రుణమాఫీ నేపథ్యంలో.. గురువారం నాడు హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో భట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో పాటు రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీ పథకం అమలుపై బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయటం.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని.. దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని ఉపముఖ్యమంత్రి భట్టి అభిప్రాయపడ్డారు.
అంతేకాక రుణమాఫీ పథకం అమలులో బ్యాంకర్ల సహకారం ఉండాలని భట్టి కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకర్లు చూడాలని.. చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలని సూచించారు. అలానే రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయాలని సూచించారు.