iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలకు స్వస్తి.. వాటి స్థానంలో స్టిల్ట్‌లకు అనుమతి?

  • Published Sep 10, 2024 | 12:32 PM Updated Updated Sep 10, 2024 | 12:32 PM

Hyderabad: నగరంలో ఇప్పటికే అక్రమణ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో సెల్లార్ల నిర్మాణానికి స్వస్తి పలకాలని భావిస్తుంది.

Hyderabad: నగరంలో ఇప్పటికే అక్రమణ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో సెల్లార్ల నిర్మాణానికి స్వస్తి పలకాలని భావిస్తుంది.

  • Published Sep 10, 2024 | 12:32 PMUpdated Sep 10, 2024 | 12:32 PM
హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలకు స్వస్తి.. వాటి స్థానంలో స్టిల్ట్‌లకు అనుమతి?

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, చెరువులు, కుంటులు, నాలాలు, ప్రభుత్వ పార్కులను అక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అంతేకాకుండా..ఈ విషయంలో సామాన్యులు, ధనికులు, సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో అక్రమ దారుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పురపాలక శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో సెల్లార్ల నిర్మాణానికి స్వస్తి పలకాలని భావిస్తుంది. మరి ఆ వివరాళ్లేంటో చూద్దాం.

నగరంలో సెల్లార్ల నిర్మాణానికి త్వరలోనే స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ, నగరంలో సెల్లార్లు లేని భవనాలంటూ ఎక్కడ లేవు. ప్రతి అపార్ట్మెంట్స్ లో కూడా సెల్లార్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే అటువంటి సెల్లార్లపై నగరవాసులు ఫిర్యాదులు చేస్తున్నట్లు తాజా సమాచారం అందింది. ముఖ్యంగా వర్షా కాలంలో సెల్లార్లలో వర్షపు నీరు చేరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, మోటార్లతో నీటిని తోడి రోడ్లపైకి వదులుతున్నమని ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలుస్తోంది. అలాగే ఈ సెల్లార్ల నిర్మాణాలకు చాలా వరకు ఎక్కువ లోతు తవ్వాల్సి వస్తుందని, దీని వల్ల పక్క బిల్డింగ్ వారికి కూడా చాలా సమస్యగా మారుతుందని తెలిసిందే.

అయితే ఈ సమస్యలపై ఎక్కువగా  ఫిర్యాదు రావడంతో.. ఇక నుంచి నగరంలో సెల్లార్ల నిర్మాణం అనుమతించ కూడదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పైగా ఈ అంశంపై మున్సిపల్ చట్టంలోని బిల్డింగ్ నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ సెల్లార్ల వలన భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని భావించడంతో.. ఈ పార్కింగ్ సెల్లార్ల స్థానంలో స్టిల్ట్‌లను చేపట్టాలని అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్టిల్ట్‌ల నిర్మాణాలకు కమర్షియల్ భవనాల నిర్మాణదారులు ఆసక్తి చూపటం లేదని తెలిసింది.  ఎందుకంటే.. కమర్షియల్ బిల్డింగుల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌కు భారీగా డిమాండ్ ఉంటుదని, ఆ స్థానంలో పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తే నష్టపోతామన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా స్టిల్ట్ విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే నగరంలోని సెల్లార్లు ఉన్న భవనాలు పరిస్థితి ఏమిటి?  కొత్తగా నిర్మణం చేపడుతున్న భవనాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై ప్రజల్లో తీవ్ర సందేహాలు మొదలవ్వనున్నాయి.

స్టిల్ట్ నిర్మాణం అంటే ఏమిటి?

స్టిల్ట్ నిర్మాణం.. సెల్లార్లు తవ్వకుండా భూమి నుంచే పార్కింగ్ కోసం నిర్మాణాలు చేపట్టడాన్ని స్టిల్ట్ అంటారు. ఇది ఎత్తైన ప్లాట్‌ఫారమ్,  నిర్మాణంపై వాహనాలను పార్కింగ్ చేయుటకు నిలువు, అడ్డ వరుస స్తంభాలతో కూడి ఉంటుంది. కనుక ఈ స్టిల్ట్ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని భావిస్తుంది.