iDreamPost
android-app
ios-app

తెలంగాణ రాష్ట్రాంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

  • Published Aug 21, 2024 | 11:11 AM Updated Updated Aug 21, 2024 | 11:11 AM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు వైరల్ ఫీవర్స్ తో పాటు మరోవైపు డెంగీ డేంజర్ బెల్స్ భారీగా మారు మోగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఈ డెండ్యూ కేసులు అనేవి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని తాజాగా వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు వైరల్ ఫీవర్స్ తో పాటు మరోవైపు డెంగీ డేంజర్ బెల్స్ భారీగా మారు మోగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఈ డెండ్యూ కేసులు అనేవి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని తాజాగా వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

  • Published Aug 21, 2024 | 11:11 AMUpdated Aug 21, 2024 | 11:11 AM
తెలంగాణ రాష్ట్రాంలో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాతవరణంలలోని కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వాతవరణంలోని వచ్చిన మార్పలు కారణంగా.. నగరంలో వైరల్ ఫీవరస్ తో పాటలు దోమల బెరద కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ మూల చూసిన విపరీతమైన దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ దోమల బెరద వలన రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా, డెంగ్యూ, గన్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా పట్నం, పల్లె అని తేడా లేకుండా.. ఈ జ్వరాల బారిన పడి హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రతల్లో అయితే ఏకంగా ఓపీకే సగటున 10 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు.మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇకపోతే గత ఇరవై రోజులుగా ఈ జ్వారల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుందని తాజాగా అధికారులు తెలిపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డెంగీ డేంజర్ బెల్స్ భారీగా మారు మోగుతున్నాయి. ముఖ్యంగా గత రెండు నెలలుగా రాష్ట్రంలోని వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరరి అధికారులు తెలిపారు. ఇక ఈ వర్షాల కారణంగా కొన్నిరోజులుగా రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమల విపరీతంగా పెరిగిపోయాయి. దీని ఫలితంగా డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా ఈ డెంగీ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 4,395 డెంగీ కేసులు నమోదవ్వగా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు అనధికారికంగా ఈ కేసులు అంతకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ జ్వరాల కారణంగా ప్రభుత్తవ హాస్పిటల్స్ కు వస్తున్న రోగులలో గన్యా, మలేరియా, డెంగీతో పాటు జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ లక్షణాలు కూడా ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అందుకే అనుమానిత కేసులకు రక్త నమూనాలు సేకరించి నిర్దారిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందని,కొన్ని కుటుంబాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది జ్వరాల బారినపడి హాస్పిటల్‌కు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పడకలు సరిపోక ఓపీలోనే ట్రీట్‌మెంట్ చేసి పంపిస్తున్నమని అధికారులు వెల్లడించారు. ఇకపోతే ఈ డెంగ్యూ జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే కాచి చల్లార్చి వడపోసిన నీరు మాత్రమే తాగాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని అంటున్నారు. దీంతో పాటు జ్వరం, విపరీతమైన దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom