iDreamPost
android-app
ios-app

దసరాకు ఊరెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పని సరి!

అందుకే.. దసరాకు ఊరికి వెళ్లే వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.

అందుకే.. దసరాకు ఊరికి వెళ్లే వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.

దసరాకు ఊరెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పని సరి!

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి తారాస్థాయికి చేరింది. వేరే ప్రాంతాల నుంచి నగరం వచ్చిన వాళ్లు సొంతూళ్లకు పయనం అయ్యారు. దీంతో బస్సు, రైలు స్టేషన్లలో రద్దీ పెరిగింది. అందరూ ఊరికి వెళ్లటంతో.. దసరా పండుగ అయిపోయే వరకు నగరం బోసి పోయినట్లుగా అయిపోతుంది. దీన్నే దొంగలు అదునుగా తీసుకుంటూ రెచ్చిపోతూ ఉంటారు. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లపై పంజా విసురుతూ ఉంటారు. దొరికిన కాడికి దోచుకెళుతూ ఉంటారు. అందుకే.. దసరాకు ఊరికి వెళ్లే వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.

దసరాకు ఊరికి వెళ్లే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

  • బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి. అలా కాకుంటే ఇంట్లోనే ఓ రహస్య ప్రదేశంలో వాటిని దాచాలి.
  • సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం.
  • సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం వాడితే మంచిది.
  • తాళం వేసి వేరే ఊరికి వెళుతున్నపుడు.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
  • నమ్మదగిన వ్యక్తుల్ని మాత్రమే వాచ్‌మెన్‌లుగా.. సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోవాలి.
  • ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
  • ఇంటి ముందు చెత్త పేరుకు పోకుండా చూసుకోవాలి. లేదంటే దొంగలను ఆహ్వానించినట్లే అవుతుంది.
  • ఇంటి మెయిన్‌ డోర్‌ను కర్టెన్‌తో మూసి వేయటం మంచిది.
  • ఊరికి వెళుతున్నా కూడా.. ఇంట్లో, బయట లైట్లను ఆన్‌ చేసి పెట్టడం మంచిది.
  • అందరూ దాచే కామన్‌ ఏరియాల్లో తాళం చెవుల్ని ఉంచకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి.
  • సోషల్‌ మీడియాల్లో పండుగ అప్‌డేట్లు పెట్టకపోవటం ఉత్తమం.
  • ఎవరిమీదైనా మీకు అనుమానం ఉంటే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గానీ, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా వాట్సాప్ నెంబర్ 9490617444 కు సంప్రదించండి.