iDreamPost
android-app
ios-app

వీడియో: గణేష్ శోభాయాత్రలో.. పోలీస్ అదిరిపోయే డ్యాన్స్

  • Published Sep 28, 2023 | 3:22 PM Updated Updated Sep 28, 2023 | 3:22 PM
  • Published Sep 28, 2023 | 3:22 PMUpdated Sep 28, 2023 | 3:22 PM
వీడియో: గణేష్ శోభాయాత్రలో.. పోలీస్ అదిరిపోయే డ్యాన్స్

తొమ్మిది రోజులుగా అంగరంగవైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు జరిగాయి. భక్తులు వివిధ రూపాల్లో మండపాలను ఏర్పాటు చేసి అందులో గణనాథులను ఏర్పాటు చేసుకుని అత్యతంత భక్తిశ్రద్ధలతో పూజించుకున్నారు. గణేష్ వేడుకల్లో భక్తి పారవశ్యంలో మునిగితేలారు భక్తులు. కాగా గణేష్ వేడుకలు ముగింపు దశకు చేరాయి. ఇప్పటికే గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ శోభాయాత్రలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భజనలు, డీజే సౌండ్స్ మధ్య నృత్యాలు చేస్తూ గణేషుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి గణేష్ శోభాయాత్రలో అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వీధులన్నీ నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులతో నిండిపోయాయి. నిమజ్జన వేడుకల్లో భక్తులు పాల్గొని సందడి చేస్తున్నారు. యువత ఆటపాటలతో అదరగొడుతూ డ్యాన్సులు చేస్తున్నారు. కాగా భక్తులతో పాటు ఓ పోలీస్ అధికారి కూడా శోభాయాత్రలో డ్యాన్స్ చేశాడు. భద్రత ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీసులు ఇలా శోభాయాత్రలో పాల్గొని డ్యాన్స్ లు చేయడం ప్రతిఒక్కరిని ఆకర్శించింది. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ పోలీస్ అధికారి అందరిని ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ విధుల్లో బిజీగా ఉండే పోలీసులు గణేష్ శోభాయాత్రలో డ్యాన్స్ లు చేయడం అందరిని ఆకర్శించింది.

మరోవైపు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తైంది. గణేష్ శోభాయాత్రలో వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణేష్ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తె రాలనంత జనం నిమజ్జన వేడుకల్లో సందడి చేశారు. నగరంలో ఇంకా నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet