Venkateswarlu
మిచౌంగ్ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అకాల వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం జల్లులు పడుతున్నాయి. జల్లులు అతి భారీ వర్షంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మిచౌంగ్ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అకాల వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం జల్లులు పడుతున్నాయి. జల్లులు అతి భారీ వర్షంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Venkateswarlu
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మిచౌంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లోనూ మిచౌంగ్ ప్రభావం మొదలైంది. నిన్నటి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు సైతం వీస్తాయని చెప్పింది.
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు యా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుఫాను ప్రభావం కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ వర్షం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మిచౌంగ్ 8 జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎమ్‌డీ వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ,
తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, నంద్యాల, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. రేపు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఇక, తమిళనాడుకు ఆనుకుని ఉన్న నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరులో వర్షాలు దంచి కొడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డు ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర దెబ్బతింది. మరి, మిచౌంగ్ తుఫాన్ ప్రభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.