iDreamPost

ఎంతకు తెగించార్రా నాయనా.. ఎస్పీని కూడా వదల్లేదు..

Cyber Crime Scammers: ఇటీవల సైబర్ నేరగాళ్లు మరి బరితెగించిపోతున్నారు.. జిల్లా ప్రధాన అధికారుల ఫోటోలు, పేర్లు వాడుకొని నేరాలకు తెగబడుతున్నారు.

Cyber Crime Scammers: ఇటీవల సైబర్ నేరగాళ్లు మరి బరితెగించిపోతున్నారు.. జిల్లా ప్రధాన అధికారుల ఫోటోలు, పేర్లు వాడుకొని నేరాలకు తెగబడుతున్నారు.

ఎంతకు తెగించార్రా నాయనా.. ఎస్పీని కూడా వదల్లేదు..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి..సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని కొంతమంది ఎన్నో రకాల నేరాలకు తెగబడుతున్నారు. ఇలాంటి నేరగాళ్లకు ఇప్పుడు టెక్నాలజీ బాగా సహకరిస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త రకం దొంగతనాలకు తెగబడుతున్నారు. సైబర్ నేరగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఉన్న చోటే ఉంటూ ఎదుటి వారిని మోసగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ మధ్య కొంతమంది సైబర్ నేరగాళ్లు బరితెగించి ఉన్నతాధికారుల పేర్లు.. వారి ఫోటోలు వాడుకొని అమాయకులను బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్న ఘటనలు ఎన్నో వెగులులోకి వచ్చాయి. తాజాగా జిల్లా ఎస్పీ ఫోటో వాడుకొని నేరాలకు పాల్పపడిన ఘటన సూర్యూపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అమాయకులను దారుణంగా మోసం చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. సైబర్ నేగాళ్లు సామాన్యులనే కాదు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు.  సైబర్ క్రైమ్ అధికారులు  ఎంత అలర్ట్ గా ఉన్నా.. కేటుగాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్డే పనిచేస్తున్నారు. ఎస్పీ సూర్యాపేట పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ప్రొఫైల్ లో ఏకంగా రాహూల్ హెగ్డే ఐపీఎస్ ఫోటో పెట్టారు.గతంలో ఎస్పీ రాహూల్ హెగ్డే చేసిన సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు పెట్టారు. దాంతో చాలా మంది ఇది నిజంగా రాహూల్ హెగ్డే ఫేస్ బుక్ అనుకొని ప్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడంతో యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత వారి పని మొదలు పెట్టారు. మెసేజ్ లతో కొంతమందికి మాయమాటలు చెప్పి కొన్ని కార్యక్రమాలకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటూ దండుకునే ప్రయత్నం చేశారు.

Didn't even leave Sp 02

ఈ విషయం సూర్యాపేట పోలీసులకు తెలియడంతో వెంటనే అలర్ట్ అయ్యారు.ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లకు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని నేరాలకు పాల్పపడుతున్న సైబర్ కేటుగాళ్ళ మోసాలు, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మధ్యనే వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య పేరుతో ఓ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి +94776414080 శ్రీలంక నెంబర్ నుంచి మీటింగ్స్ ఉన్నాయ.. అర్జంట్ గా డబ్బులు పంపించాలంటూ పలువురికి మెసేజ్ లు పంపారు. ఇది గమనించిన కలెక్టర్ ప్రావిణ్య పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసుకొని సైబర్ నేరగాళ్ళ వేటలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి