iDreamPost
android-app
ios-app

ACB వలలో అవినీతి తిమింగలం.. ఇప్పటి వరకు రూ.100కోట్ల ఆస్తులు గుర్తింపు!

  • Published Jan 24, 2024 | 9:47 PM Updated Updated Jan 25, 2024 | 8:15 AM

అవినీతి నిరోధక శాఖ ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వంలోని అవినీతి అధికారులు పంథా మారడం లేదు. లంచం తీసుకుంటూ చాలా మంది అధికారులు ఏసీబీ దొరికి వారి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది.

అవినీతి నిరోధక శాఖ ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వంలోని అవినీతి అధికారులు పంథా మారడం లేదు. లంచం తీసుకుంటూ చాలా మంది అధికారులు ఏసీబీ దొరికి వారి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది.

  • Published Jan 24, 2024 | 9:47 PMUpdated Jan 25, 2024 | 8:15 AM
ACB వలలో అవినీతి తిమింగలం.. ఇప్పటి వరకు రూ.100కోట్ల ఆస్తులు గుర్తింపు!

ప్రభుత్వ అధికారులు అంటే ప్రజల కోసం పని చేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. అంతేకాక సమస్యతో తమ వద్దకు వచ్చిన సామాన్య ప్రజలకు, పౌరులకు సత్వరమే న్యాయం జరిగిలే చూడటం వారి బాధ్యత. ఇలా ఎంతో మంది అధికారులు తమ విధుల్లో నిజాయితీగా ఉంటూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ప్రభుత్వ అధికారులు అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఇలాంటి అవినీతి తిమింగలాలు తరచూ ఏసీబీ అధికారులకు చిక్కుతుంటాయి. ఇప్పటికే చాలామంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడగా.. తాజాగా మరో పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. ఇప్పటి వరకు అతడి నుంచి దాదాపు రూ.100 కోట్ల విలువైన అవినీతి ఆస్తులను గుర్తించారు.

బుధవార అవినీతి నిరోధక శాఖ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్ట్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈక్రమంలో శివబాలకృష్ణ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 బృందాలు విడిపోయి సోదాలు చేశారు. బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఈ బృందాలు సోదాలు చేశాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు.

ఇంకా శివబాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. వీటిని తెరచిన తరువాతం ఈ అవినీతి సొమ్ము ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శివబాలకృష్ట మెట్రో రైల్‌ ప్లానింగ్‌ అధికారి, రెరాలో కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. ఇక ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.100 కోట్ల విలువ ఆస్తులను గుర్తించారు. అందులో రూ.40లక్షల నగదు, 2 కేజీల బంగారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 14 స్మార్ట్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు అధికారులు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.100 కోట్ల  ఉంటుంది.

బాలకృష్ణ ఇంట్లో డబ్బులను లెక్కించే  కౌంటింగ్‌ యంత్రాలను సైతం అధికారులు గుర్తించారు. నాలుగు బ్యాంకు లాకర్లు సైతం ఏసీబీ గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ తనిఖీలు గురువారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏలో డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆయన బ్యాంకు లాకర్లు, బంధువుల నివాసాల్లో  తనిఖీలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలతో రూ.కోట్లు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారం ఆధారంగా ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.  మరి.. ఇలాంటి అవినీతి అధికారులకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet