Swetha
మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే అందరికి ప్రత్యేకమే. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు ఈ జాతరకు పోటెత్తుతారు. ఈ క్రమంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాలు కాపిడి.. తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్.
మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే అందరికి ప్రత్యేకమే. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు ఈ జాతరకు పోటెత్తుతారు. ఈ క్రమంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాలు కాపిడి.. తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్.
Swetha
సాధారణంగా జాతరలో వేల సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి.. పోలీసులు కూడా ఆ పరిస్థితులను అదుపులో ఉంచడానికి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందులోను ఎంతో విశిష్టమైన సమ్మక్క సారక్క జాతర అంటే . ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే , ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా సమ్మక్క సారక్క జాతర ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే జాతర జరిగే సమయంలో ఓ వ్యక్తి గుండెపోటుతో ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. అందరు అలా చూస్తూ ఉంటే .. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ మాత్రం సమయస్ఫూర్తితో స్పందించి.. ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. దీనితో ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో అందరు షేర్ చేస్తున్నారు.
సీపీఆర్ చేసిన ఆ కానిస్టేబుల్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలం.. పాకాలగూడెంకు చెందిన తోట నాగ ముత్యం. ఇతను దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన విధి నిర్వహణలో భాగంగా మేడారం జాతరకు బందోబస్తుగా వెళ్ళాడు. అలానే మేడారం జాతరకు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి వచ్చాడు. అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో .. ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న జనం ఏం చేయాలో అర్థంకాక.. అలా చూస్తూ ఉండిపోయారు. కానీ, అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగ ముత్యం మాత్రం. సరై సమయంలో తన సమయస్ఫూర్తిని ఉపయోగించి.. అతనికి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు నిలబెట్టాడు. అప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న ఆ వ్యక్తి.. సాధారణం స్థితికి రావంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీనితో అక్కడి జనం ఆ కానిస్టేబుల్ ను ప్రశంసించారు.
అవసరం అయిన సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి.. కానిస్టేబుల్ నాగ ముత్యం.. రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇతను ప్రస్తుతం మేడారం జాతర విధుల్లో ఉన్నారు. చుట్టుప్రక్కల ఉన్న జనమే కాకుండా.. కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై అతని ఉన్నతాధికారులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు. రియల్ హీరో అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తూ నాగ ముత్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A cop is seen giving CPR to a devotee, who collapsed at the Medaram Jatara in Bhupalpally district, #Telangana @TOIHyderabad @TelanganaDGP @TelanganaCOPs pic.twitter.com/VbzwIx2XCe
— Pinto Deepak (@PintodeepakD) January 30, 2024