iDreamPost
android-app
ios-app

పోలీస్ అన్నా నీకు హ్యాట్సాఫ్.. రాళ్ల గుట్టల్లో భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్!

  • Published Apr 27, 2024 | 6:36 PM Updated Updated Apr 27, 2024 | 6:36 PM

Constable Goodness: పోలీస్ అనగానే కొంతమంది కిలోమీటర్ దూరం వెళ్తారు. ప్రతి విషయంలోనే కఠినంగా వ్యవహరించే పోలీసులు పలు సందర్భాల్లో మనసున్న మారాజు గా తమ మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటన నల్లమల సళేశ్వరం జాతర సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

Constable Goodness: పోలీస్ అనగానే కొంతమంది కిలోమీటర్ దూరం వెళ్తారు. ప్రతి విషయంలోనే కఠినంగా వ్యవహరించే పోలీసులు పలు సందర్భాల్లో మనసున్న మారాజు గా తమ మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటన నల్లమల సళేశ్వరం జాతర సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

పోలీస్ అన్నా నీకు హ్యాట్సాఫ్.. రాళ్ల గుట్టల్లో భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్!

పోలీసులు అనగానే ఎంతో కర్కశంగా ఉంటారు.. వాళ్లతో పెట్టుకుంటే బెండు తీస్తారు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ పోలీసులు కేవలం నేరస్తులను భయపెట్టడానికి అలాంటి స్వభావంతో ఉండాల్సి వస్తుందని. సమాజంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, దాడులు, కొట్లాటలు, విధ్వంసాలు జరగకుండా కఠినంగా ఉండాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. నేరస్తుల విషయంలో మాత్రమే కఠినంగా ఉంటామని.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాము ముందుంటామని పోలీసు అధికారలు చెబుతుంటారు.కష్టాల్లో ఉన్నవాళ్లు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లను ఎంతోమంది రక్షించిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ కానిస్టుబుల్ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

నల్లమల అడవుల్లో ఓ వృద్దురాలిని తన భుజాన వేసుకొని నాలుగు కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్ ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే నల్లమల సళేశ్వరం జాతర వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఓ వైపు ఎండ దంచి కొడుతున్నా.. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, కొండలు గుట్టలు దాటుతూ సళేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. లోయల్లో కాలి నడకన కర్రల సాయంతో భక్తులు ప్రయాణించాల్సిందే. ఈ క్రమంలోనే ఓ భక్తురాలు కొండపైకి ఎక్కేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఆ వృద్దురాలి కష్టం చూసి చలించిపోయిన ఓ కానిస్టేబుల్ తన ఔదార్యం చూపించాడు. భక్తురాలిని తన వీపుపైకి ఎక్కించుకొని దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు కొండపైకి తీసుకువెళ్లాడు.

ప్రస్తుతం నల్లమల సళేశ్వరం జాతర జోరుగా సాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ నేథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా ఏర్పట్లు పటిష్టంగా చేసింది. అచ్చంపేట పోలీస్ స్టేషన్ కి చెందిన రమావత్ రామదాస్ అనే కానిస్టేబుల్ సళేవ్వరం ఆలయం వద్ద భద్రత సిబ్బందిగా ఉన్నారు. నాగర్ కర్నూల్ కి చెందిన ఓ భక్తురాలు కొండపైకి ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడింది. ఆమె బాధ చూసిన రామదాస్ తన వీపుపై ఎక్కించుకొని నాలుగు కిలోమీటర్ల వరకు కొండపైకి తీసుకువెళ్లాడు.పోలీసులు అంటే చాలా వరకు కఠినంగా, కర్కశత్వంగా ఉంటారని భావిస్తుంటారు. కానీ వారిలో ఎంతోమంది మంచీ, మానత్వం చాటుకునేవారు ఉన్నారని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. భక్తురాలిని తన వీపుపై ఎక్కించుకొని తీసుకువెళ్లిన కానిస్టేబుల్ రామదాస్ పై స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.