P Krishna
తెలంగాణలొ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ నెల 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు ఉండబోతున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.
తెలంగాణలొ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ నెల 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు ఉండబోతున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు.
P Krishna
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. గత నెల ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్లు జాతర మొదలైంది. ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికీ కొన్ని పార్టీలు బీ-ఫారమ్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. ఇక పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తూ టికెట్ ఆశించి భంగపడ్డాళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటే, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు గులాబీ కండువ కప్పుకున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సేవలు చేస్తూ వస్తున్న తనను కాదని వేరే వారికి టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. ఈ సారి ఎన్నికలను అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ నుంచి జాతీయ నేతలు ప్రచారానికి వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు తీరని దుఖఃంలో మునిగిపోయారు. కొంతమంది రెబల్ గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మరికొంతమంది ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. నామినేషన్ ప్రక్రియకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
మిర్యాలగూడ స్థానాన్ని బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ స్థానం నుంచి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, పటాన్ చెరుకు కాటా శ్రీనివాస్ గౌడ్ కు, సూర్యాపేట టికెట్ ను సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించారు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ కి, దామోదర్ రెడ్డికి మధ్య కొంత కాలంగా టికెట్ విషయంలో తీవ్ర పోరు నడిచింది. ఈ క్రమంలోనే సూర్యాపేట టికెట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించడంతో పటేల్ రమేష్ కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.. ఇప్పటి వరకు ఎంతో నమ్మకం పెట్టున్నామని.. నమ్మించి మోసం చేశారని కన్నీరు మున్నీరు అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతుంది.
ఇక పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు అధిష్టానంపై ధ్వజమెత్తారు. రెండోసారి కూడా టికెట్ విషయంలో పటేల్ అన్నను మోసం చేస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే అధిష్టానం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ పటేల్ రమేష్ రెడ్డి భార్యా, పిల్లలు బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు రమేష్ రెడ్డి ఇంటికి చేరుకొని ఓదార్చారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.తనకు టికెట్ రాకుండా దారుణమైన కుట్ర చేశారని, కొంతమంది నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని, కేవలం మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు ఈ పని చేశారని పటేల్ రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.