P Krishna
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
P Krishna
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలను ఆకర్షించడంతో కాంగ్రెస్ కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉనికి మళ్లీ చాటుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుమీద ఉంది. గత ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలపై పార్టీ నేతలో ఇప్పటికే చర్చించి.. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ కాంగ్రెస్ లో లోక్ సభ అభ్యర్థుల ఖారారు కీలకంగా మారింది. సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కి పార్లమెంట్ ఎన్నికలు ఒక సవాల్ గా నిలిచాయి. ఈసారి 10 నుంచి 12 సీట్లు దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి జాబితాలో ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేశారు. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరామ్ నాయక్, నల్లగొండ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గురువారం కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా.. తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. ఐదుగురు అభ్యర్థుల్లో మల్కాజ్ గిరి – సునిత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ – దానం నాగేందర్, చేవెళ్ల – రంజీత్ రెడ్డి, నాగర్ కర్నూల్ – మల్లు రవి, పెద్దపల్లి – గడ్డం వంశీకృష్ణ పేర్లను అధిష్టానం వెల్లడించింది. ఇంకా ఎనిమిది స్థానాలు హస్తం పార్టీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఇక లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి భుజాలపై మోపింది కాంగ్రెస్ అధిష్టానం.