P Krishna
Komatireddy Raj Gopal Reddy, Munugode, TS Election Results 2023: తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతూ వస్తుంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
Komatireddy Raj Gopal Reddy, Munugode, TS Election Results 2023: తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతూ వస్తుంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
P Krishna
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అయిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో దూసుకు వెళ్లింది.. చివరి వరకు తగ్గేదే లే అన్నట్లు రిజల్ట్స్ కనిపించాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ మరోసారి తమ ఆధిక్యతను చాటుకున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్, బీజేపీ కన్నా ముందంజలో ఉన్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అధికార పార్టీ బీఆర్ఎస్ కన్నా 5407 ఓట్ల తో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బడా కాంట్రాక్టర్స్ గా పేరు తెచ్చకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమాని అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1999 ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం వరుసగా ఎమ్మెల్యే గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే అన్నబాటలో నడుస్తూ రాజ్ గోపాల్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ తరుపు నుంచి 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఘన విజయం సాధించారు. 2016 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి గెలుపొందారు. కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై కలత చెంది 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడు.. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2022 లో మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకి కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. 2023 జులై 5 న రాజ్ గోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ నియమించింది. అయినా కూడా ఆయనలో ఏదో అసంతృప్తి కొనసాగుతూ వచ్చింది. అధికార పార్టీ బీఆర్ఎస్ పాలనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన రాజ్ గోపాల్.. తాను బీజేపీలో ఉంటే ఏమీ సాధించలేనని తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటూ వచ్చిన రాజ్ గోపాల్ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించారు. యూత్ లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. బీజేపీలో చేరినా.. కాంగ్రెస్ లో కొనసాగినా.. రాజ్ గోపాల్ రెడ్డి ఛరిష్మా మునుగోడు నియోజకవర్గంలో అలాగే ఉందని మరోసారి నిరూపించారు. నేడు తెలంగాణలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత కొనసాగిస్తున్నారు.. ఆయన గెలుపు పక్కా అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.