iDreamPost
android-app
ios-app

లవర్స్‌కి మారుతీరావు ఫ్యాన్స్‌ మాస్‌ వార్నింగ్‌.. వైరల్‌ అవుతోన్న లేఖ!

Miryalaguda, Maruthi Rao: మీకు మిర్యాల గూడకు చెందిన మారుతీ రావు గుర్తున్నాడా?. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని భరించలేక.. అల్లుడిని నడిరోడ్డుపై హత్య చేయించాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగి చివరికి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఓ అభిమాని లేఖతో మరోసారి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Miryalaguda, Maruthi Rao: మీకు మిర్యాల గూడకు చెందిన మారుతీ రావు గుర్తున్నాడా?. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని భరించలేక.. అల్లుడిని నడిరోడ్డుపై హత్య చేయించాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగి చివరికి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఓ అభిమాని లేఖతో మరోసారి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లవర్స్‌కి మారుతీరావు ఫ్యాన్స్‌ మాస్‌ వార్నింగ్‌.. వైరల్‌ అవుతోన్న లేఖ!

ప్రేమ అనేది చాలా చిన్న మాటే. కానీ, దీని కారణంగా జరిగే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ పేరుతో జరగుతున్న ఘోరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆత్మహత్యలు, హత్యలు వంటివి ఈ  ప్రేమ కథల్లో  ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా ఎన్నో లవ్ ఇన్సిడెంట్స్ జరిగినా..కొన్ని మాత్రం అందరికి గుర్తుండి పోతాయి. అలాంటి వాటిల్లో అమృతా, ప్రణయ్ కథ ఒకటి. వీరి కథలో మారుతిరావు అనే తండ్రి పాత్ర ప్రధానమైనది. కొన్నేళ్ల క్రితం జరిగిన వీరికి సంబంధించిన ఓ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నేడు మారుతిరావు వర్థంతి సందర్భంగా ఓ అభిమాని రాసిన లేఖతో మరోసారి ఈ ఘటన వైరల్ అవుతోంది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది ప్రేమికులు పెద్దలు ఎదిరించి పెళ్లిళ్లు చేసుకుంటారు. మరికొందరు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటారు. ఇవి రెండు బాగానే ఉన్నాయి. ఈ ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు అనేవి కూడా జరుగుతుంటాయి. ఇప్పటివరకు జరిగిన పరువు హత్యల్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఒక్కగానొక్క కుమార్తెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఓ తండ్రి. అలాంటి తన ప్రాణాన్ని ఎవరో తమకు అసలు సంబంధం లేని వ్యక్తి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం జరిగింది.ఇదే సమయంలో కూతురే తనను ఎదిరించడం చేసింది.

ఇవన్నీ భరించలేక కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని హత్య చేసి తన కుమార్తెను తాను తీసుకొచ్చుకోవాలని ఆ తండ్రి మారుతీ రావు అనుకున్నాడు. అయితే ఆయన చేసిన ప్రయత్నం వారి కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కిరాయి రౌడీలతో అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని చంపించాడు. ఆ తర్వాత కుమార్తె పెట్టిన కేసు.. కిరాయి రౌడీల ఒత్తిడితో మానసికంగా కుంగిపోయి.. సుసైడ్ చేసుకున్నాడని స్థానికులు చెబుతుంటారు. ప్రణయ్ హత్య, తరువాత, ఆయన ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారింది. మార్చి8న మారుతిరావు ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇక ఈ ఘటన విషయంలో మారుతిరావుకు కూడా మద్దతుగా నిలిచిన వాళ్లు ఉన్నారు. ఆయనకు సపోర్టు చేస్తూ నినాదాలు కూడా చేశారు.

మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని మార్చి 8 వ తేదీకి సరిగ్గా 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మారుతీ రావు అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్.. మరోసారి ఈ ఘటన గురించి రచ్చ రేపుతోంది. ప్రేమదోమ అంటూ తిరిగే వారి పాలిట మారుతీ రావు ఓ సింహ స్వప్నం అని ఆ వీరాభిమాని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై సోషల్ మీడిలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ పోస్టుపై కామెంట్లలో నెటిజన్లు కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ముమ్మాటికీ మారుతీ రావు చేసింది కరెక్ట్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన చేసిన పనిని వ్యతిరేకిస్తున్నారు. మారుతీ రావు చేసిన తొందరపాటు పని రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కుమార్తె సంతోషం కన్నా ఆ తండ్రికి పరువే ఎక్కువైందా అంటూ మారుతీరావు చేసిన పనిని విమర్శిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా మారుతీ రావే కరెక్ట్ అంటూ ఆయనకు మద్దతుగా కామెట్లు పెడుతున్నారు. ప్రేమ-గీమా, లవ్వు-గివ్వూ అంటూ తిరిగే కొందరికి మారుతీ రావు సింహ స్వప్నం అంటూ ఓ ఫ్యాన్ ఏకంగా మారుతీ రావును పొగడ్తలతో ముంచేశారు. ఒక తండ్రిగా మారుతీరావు చాలా మంచివాడని, తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను అమృత దుర్వినియోగం చేసిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక తండ్రిగా మారుతి రావు ఇప్పటికీ మంచోడేనని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా మారుతిరావు వర్ధంతి సందర్భంగా ఓ  అభిమాని చేసిన పోస్టు కారణంగా సోషల్ మీడియలో రచ్చ జరుగుతోంది.