iDreamPost
android-app
ios-app

తెలంగాణలో కోకాకోలా కంపెనీ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.700 కోట్లతో ప్లాంట్‌

  • Published Jun 10, 2024 | 9:52 AM Updated Updated Jun 10, 2024 | 9:52 AM

Coca Cola Company: తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది కోకా కోలా కంపెనీ. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఆ వివరాలు..

Coca Cola Company: తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది కోకా కోలా కంపెనీ. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Jun 10, 2024 | 9:52 AMUpdated Jun 10, 2024 | 9:52 AM
తెలంగాణలో కోకాకోలా కంపెనీ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.700 కోట్లతో ప్లాంట్‌

ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అక్కడ పరిశ్రమలు మెండుగా ఉండాలి. అప్పుడే స్థానిక యువతకు ఉపాధి లభించి.. వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. తద్వారా ఆయా ప్రాంతాల వారు అభివృద్ధి చెంది.. అది సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇక ప్రభుత్వ విధనాలు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండాలి. కంపెనీలు నెలకొల్పడానికి అనువైన వాతావరణం కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులివ్వాలి. అప్పుడే కంపెనీలు.. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. ఇక తెలంగాణ సర్కార్‌ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది కనుక.. రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇక తాజాగా కోకాకోలా కంపెనీ.. రాష్ట్రంలో ఏకంగా 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

ప్రముఖ ఇంటర్నేషనల్‌ కూల్‌ డ్రింక్‌ కంపెనీ కోకాకోలా.. తెలంగాణలో తమ సంస్థను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ ప్లాంట్‌ ఉండగా.. మరిన్ని కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఈ విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో రూ.700 కోట్ల రూపాయల పెట్టుబుడుల పెట్టి.. తమ ప్లాంట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీథర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నాడు అనగా జూన్‌ 8న కోకాకోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

పెట్టుబడులకు తమ రాష్ట్రం తెలంగాణ చాలా అనుకూలంగా ఉందని.. కనుక తమ ప్రాంతంలోపెట్టుబడి పెట్టి పరిశ్రమను విస్తరించాలని.. కోకాకోలా కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. వీరి ప్రతిపాదనలు విని.. వీటిపై సానుకూలంగా స్పందించారు కంపెనీ డైరెక్టర్‌ జోనథన్‌. తాము హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక కంపెనీ విస్తరణలో భాగాంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాండ్‌ ఏర్పాటు చేయడానికి కోకాకోలా కంపెనీ ప్రతినిధులు అంగీకరించారని.. మంత్రి శ్రీధర్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కోకాకోలా కంపెనీ.. పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్‌ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మ్ అయిన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) స్థాపించనుంది. ఇక ఇప్పటికే పెద్దపల్లిలో ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.