iDreamPost
android-app
ios-app

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ రూ.5 లక్షలు..!

  • Published Jun 02, 2024 | 11:41 AM Updated Updated Jun 02, 2024 | 12:06 PM

CM Revanth Reddy: తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఘనంగా తెలంగాన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు.

CM Revanth Reddy: తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఘనంగా తెలంగాన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు.

  • Published Jun 02, 2024 | 11:41 AMUpdated Jun 02, 2024 | 12:06 PM
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ రూ.5 లక్షలు..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500 వలకే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇలా పలు పథకాలు ప్రారంభించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర లోగో నమూనా కూడా మార్చారు. రైతులకు ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తామన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.  తెలంగాణలో సొంత ఇళ్లు లేని వారు ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సభాముఖంగా తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున.. ప్రతి ఏడాది 4.50 ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని అన్నారు. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిందని అన్నారు. ఈ ఒక్క ఏడాదే 22,500 కోట్ల రూపాయలు వెచ్చించిందని అన్నారు. ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు తొలిదశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు పై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలకు రుణం ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.