iDreamPost
android-app
ios-app

CSK vs SRH మ్యాచ్‌కు CM రేవంత్‌ రెడ్డి! ధోనితో మీటింగ్‌?

  • Published Apr 05, 2024 | 1:54 PM Updated Updated Apr 05, 2024 | 1:54 PM

CSK vs SRH Match: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 2024 ఐపీఎల్ మ్యాచ్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. జట్ల మధ్య పోరు నడుస్తుంటే.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొటుంది.

CSK vs SRH Match: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 2024 ఐపీఎల్ మ్యాచ్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. జట్ల మధ్య పోరు నడుస్తుంటే.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొటుంది.

CSK vs SRH మ్యాచ్‌కు CM రేవంత్‌ రెడ్డి! ధోనితో మీటింగ్‌?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ మానియా నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన జట్టు టాప్ పోజీషన్లో ఉంటుందా? ఈసారైనా కప్పు కొడతమా? అంటూ మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఊపిరి బిగపట్టి చూస్తుంటారు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోట్లలో బెట్టింగ్ నడుస్తుందని వార్తలు వస్తూనే ఉంటాయి. ఈరోజు శుక్రవారం 5 ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్(SRH), చెన్నై(CSK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఇరు జట్ల మధ్య పోటీ చూసేందుకు కోట్ల మంది జనాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ తిలకించేందుకు తెలంగాణ సీఎం వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే..

శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)మధ్య సాగే ఉత్కంఠ పోరు తిలకించేందుకు ఇప్పటికే అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పసుపు జెర్సీలు, సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఆరెంజ్ జర్సీలతో కోలాహలంగా ఉండబోతుంది. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఫ్యామిలీతో ఐపీఎల్ మ్యాచ్ చూడనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో కీలక పోరు జరగనుంది.. దీంతో ఉప్పల్ స్టేడియం అభిమానులతో  కిక్కిరిసిపోనుంది. ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ సూపర్ కింగ్స్ మధ్య 18వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. క్రికెట్ అంటే మొదటి నుంచి ఎంతో అభిమానించే సీఎం రేవంత్ రెడ్డి నేడు జరగబోయే ఉత్కంఠభరిత మ్యాచ్ తిలకించేందుకు సిద్దమయ్యారు. ఈ మ్యాచ్ అనంతరం ఆయన ఇరు జట్లను కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ఎంఎస్ దోనీకి హైదరాబాద్ తో ఎంతో అనుబంధం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ తర్వాత ఎంఎస్ దోనీని ప్రత్యేకంగా కలిసి మాట్లాడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ గా క్లారిటీ లేదు.