iDreamPost
android-app
ios-app

Revanth Reddy: కరెంట్‌ కట్‌ చేస్తే.. తాట తీస్తా.. CM రేవంత్‌ మాస్‌ వార్నింగ్‌

  • Published Feb 23, 2024 | 10:47 AM Updated Updated Feb 23, 2024 | 10:47 AM

రాష్ట్రంలో వెలుగు చూస్తోన్న కరెంట్‌ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారులకు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో వెలుగు చూస్తోన్న కరెంట్‌ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. అధికారులకు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Feb 23, 2024 | 10:47 AMUpdated Feb 23, 2024 | 10:47 AM
Revanth Reddy: కరెంట్‌ కట్‌ చేస్తే.. తాట తీస్తా.. CM రేవంత్‌ మాస్‌ వార్నింగ్‌

ఇంకా వేసవి ప్రారంభం కాలేదు.. కానీ రాష్ట్రంలో అప్పుడే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్‌ కోతలు ఉంటున్నాయి. దీని వల్ల నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న రోజుల్లో ఎన్ని గంటలు కరెంట​ కట్‌ చేస్తారో అని భయపడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ కోతల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. అకారణంగా కరెంట్‌ కట్‌ చేస్తే.. తాటా తీస్తానంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే.. అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని.. ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందన్నారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్‌.. ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాక గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విద్యుత్‌ కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యుత్తు శాఖ అధికారులదే అన్నారు రేవంత్‌.

స‌చివాల‌యంలో గృహ‌జ్యోతి, రూ.500కే సిలిండ‌ర్ పథకాలపై స‌మీక్ష‌కు ముందు ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి విద్యుత్ కోత‌ల‌పై సాగుతున్న దుష్ప్రచారంపై అధికారుల‌ను ప్ర‌శ్నించారు. నిర్ల‌క్ష్యంగా, అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

గ‌త ప్ర‌భుత్వ‌ హ‌యాంలో నియ‌మితులైన కొంద‌రు క్షేత్ర‌స్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా కోత‌లు పెడుతున్నార‌ని తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్‌ హెచ్చిరించారు. ఎక్క‌డైనా అయిదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే అందుకు గ‌ల కార‌ణాల‌పై వెంట‌నే స‌మీక్షించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. సాంకేతిక‌, ప్ర‌కృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా కోత‌ల‌కు కార‌ణ‌మైతే వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్‌లకు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. అలానే గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş