RTC ప్రయాణికులకు రిస్క్ లేకుండా.. CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తు వస్తున్నారు. ఇందులో భాగమే మహాలక్ష్మి పథకం. ఈ  పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణిస్తున్నారు.  దీంతో  బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఒకదశలో బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సీఏం రేవంత్ రెడ్డి ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు.  వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రయాణికుల రద్దీ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పాత బస్సులను నడుపుతున్నారు. అవి  ఎక్కడ మొరాయిస్తాయో అర్థం కాని పరిస్థితి. దానికి తోడు బస్సుల నుంచి వచ్చే పొగతో పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని  సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై సీట్లు దొరకవు అనే టెన్షన్, పాత బస్సుల నుంచి పొగ వస్తుందన్న బాధ తీరనున్నాయి. హైదరాబాద్ నగరం కాలుష్యం నుంచి కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై అధికారులతో చర్చించి ఒక విధానం ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు.

కాలుష్య నివారణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు.. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అవుతుందన్నారు.  ఇటీవల హైదరాబాద్ నగరం సుందరీకరణ చేయడంతో పాటు భవిష్యత్ లో ఎలాంటి వరదలు వచ్చినా తట్టుకునేలా తీర్చి దిద్దేందుకు ‘హైడ్రా’ను రంగంలోకి దింపారు.  హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా కాలంగా కొంతమంది కబ్జాదారులు నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు హైడ్రా  వాటన్నింటిని  కూల్చివేసే  కార్యక్రమం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు  చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలు, పార్కులు అనధికార ఆక్రమణలు తొలగించబడ్డాయి. మరికొన్ని సంస్థలు, నిర్మాణాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది.

నగరంలో నీరు, గాలి కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవనం చేయాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం రేవంత్ అన్నారు.  కాలుష్య నియంత్రణలో భాగంగా నగరంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ ఆటోలను పరుగులు పెట్టించ పెట్టించనున్నట్లు తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాల కొనుగోలు సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో పొల్యూషన్ శాతం కూడా బాగా పెరిగిపోతుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తెవాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇదే గనక జరిగితే  గాలి, శబ్ధ కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. మహిళా ప్రయాణికులు ఎక్కువ ప్రయాణించడంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. కొత్తగా వచ్చే బస్సుల్లో మహిళల రద్దీ తగ్గి ప్రశాంతమైన ప్రయాణం చేసే ఛాన్స్ ఉంటుంది.

Show comments